నారా లోకేశ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ముద్దుల తనయుడు. పాపం.. లోకేశ్ ను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. తన జీవితంలో ఎందరినో ఎమ్మెల్యేలు చేసిన చంద్రబాబు.. సొంత కొడుకును మాత్రం ఎమ్మెల్యే చేయలేకపోతున్నారు. పాపం.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలిసారే ఓటమితో కుంగిపోవాల్సి వచ్చింది.

 

అయితే ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా లోకేశ్ ఎమ్మెల్యే కాలేడట.. అందుకు ఆయన వైఖరే కారణమట. ఈ మాట అంటున్నది వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌. ఎందుకంటే.. ఆయనపై ఇటీవల దాడి జరిగింది. అయితే.. తనపై జరిగిన దాడి వెనక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ హస్తం ఉందని నందిగం సురేశ్ అంటున్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్‌ చేయాలి ఎంపీ డిమాండ్‌ చేశారు.

 

అంతే కాదు.. భవిష్యత్తులో తనపై దాడులు జరిగితే బాబు, లోకేష్‌లే కారణమన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే.. లోకేష్‌ ఈ జన్మకు ఎమ్మెల్యే కాలేడన్నారు. పింఛన్‌ డోర్‌ డెలవరీ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు దిగుతున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది.. ప్రజలకు సమాన ఫలాలు అందుతాయన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు.

 

శివరామకృష్ణ కమిటీ అమరావతిని రాజధాని వద్దని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. టీడీపీ నేతలు హైదరాబాద్‌ నుంచి పారిపోయి అమరావతి వచ్చి రైతుల భూములను బెదిరించి లాక్కున్నారన్నారు. రాజధాని ప్రాంతంలోని నిజమైన రైతులకు నష్టం జరగదని, రైతులు, దళితులను చంద్రబాబు భయపెడుతున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: