భార‌తీయ భూ వైజ్ఞానిక స‌ర్వేక్ష‌ణ (జియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా-జిఎస్ఐ) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా ఎం. శ్రీ‌ధ‌ర్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించారు.  ఇంత‌కుముందు, జిఎస్ఐ ద‌క్షిణప్రాంతం అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా శ్రీ‌ధ‌ర్ సేవ‌లు అందించారు.  ఆయ‌న 1986వ సంవ‌త్స‌రం లో జిఎస్ఐ లో  చేరారు.  హిమాల‌యాలు మొద‌లుకొని ద‌క్షిణ భార‌త ద్వీప క‌ల్పం వ‌ర‌కు భూ వైజ్ఞానిక రంగంలో శ్రీ‌ధ‌ర్ విస్తృతంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారు.

ఆయ‌న అనేక  కార్య సాధ‌న‌లను సొంతం చేసుకొన్నభూగ‌ర్భ వైజ్ఞానికులు. జిఎస్ఐకి చెందిన వివిధ జాతీయ ప్రాజెక్టులను నిర్వ‌హించ‌డంలో ఒక టెక్నోఅడ్మినిస్ట్రేట‌ర్ గా  శ్రీ‌ధ‌ర్ వ్య‌వ‌హ‌రించారు.  జియాలజిక‌ల్ మ్యాపింగ్, ఖ‌నిజాల అన్వేష‌ణ‌, మ‌రీ ముఖ్యంగా వ‌జ్రాలు, ఇంకా విలువైన ఖ‌నిజాల రంగంలో జాతీయ ప్ర‌ఖ్యాతిని పొందిన  శాస్త్రజ్ఞునిగా  శ్రీ‌ధ‌ర్ పేరు తెచ్చుకొన్నారు.

వ‌జ్రాల అన్వేష‌ణ రంగం లో ఆయన అసాధార‌ణ తోడ్పాటు కు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైనటువంటి నేశ‌న‌ల్  జియో సైన్స్ అవార్డు ను ఆయనకు ప్రదానం చేసింది. శ్రీ‌ధ‌ర్ రాజ‌మండ్రి లో రాజ‌మండ్రి ఆర్ట్స్ క‌ళాశాల పూర్వ విద్యార్థి.  ఆయ‌న 1980 లో ఆంధ్రా  విశ్వ‌విద్యాల‌యం నుండి భూగ‌ర్భ శాస్త్రం లో ప‌ట్ట‌భ‌ద్రుడ‌య్యారు.

అనంత‌రం 1983లో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుండి భూగ‌ర్భ విజ్ఞాన  శాస్త్రం లో మాస్ట‌ర్స్ డిగ్రీ ని   పొందారు.  1985 లో అదే విద్యా సంస్థ నుండి హైడ్రో జీయాల‌జీ లో ఎంటెక్ డిగ్రీ ని పూర్తి చేశారు.  ఖనిజాల అన్వేషణ లో మెరుగైన ఫలితాల సాధన కై క్షేత్ర  కార్యకలాపాలను ముమ్మరం చేయడం, ప్రయోగశాలల కు పునరుత్తేజాన్ని ఇవ్వడం తో పాటు ప‌రిశోధ‌న- అభివృద్ధి (ఆర్ & డి) కార్యక‌లాపాల కు అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు జిఎస్ఐ డైరెక్టర్ జనరల్  ఎం. శ్రీ‌ధ‌ర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: