తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తమదైన శైలిలో రాజకీయం చేసి చెక్ పెట్టడం జరిగింది. నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉండగా వీటిలో చండూరు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేరేడుచర్ల, హాలియా,నల్గొండ, చౌటుప్పల్, యాదగిరిగుట్టల్లో‌ మాత్రం టిఆర్ఎస్‌కు దీటుగా కౌన్సిలర్లను గెలుచుకుని, సవాల్ విసిరింది కాంగ్రెస్. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో గెలవాలన్న ఫ్లాన్ టిఆర్ఎస్‌ది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్ని చోట్ల గెలవలేక పోయింది టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు మాత్రం చెక్ పెట్టడం జరిగిందని అంటున్నారు. ముఖ్యంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఆ సమయంలో సంచలనంగా మారింది.

 

పెద్ద ఇష్యూ గా నడిచింది. కారణం ఏమిటంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం లోని మునిసిపాలిటి. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలను చాలా చాలెంజ్ గా తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ధర్నాలు రాస్తారోకోలు చేసి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేసి హడావిడి సృష్టించి కాంగ్రెస్ పార్టీ తన బలం నిరూపించుకుంది. అయితే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలంగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన నాయకులు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తో రంగంలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ దిగి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయాలను ఖండిస్తూ పోరాటాలు చేయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు ఇప్పుడు గాంధీభవన్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

 

ఫామ్ లోకి వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కామెంట్ చేస్తున్నారు...నేతల్లో కొత్త జోష్ నింపింది. ఇదే పోరాటం కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని కోమటిరెడ్డి బ్రదర్స్..మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమ పార్టీకి చెందిన నేతలను తీసుకోవడంపై చేసిన పోరాటం పై రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: