దేశం లో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రోజుకింత పెరుగుతోంది . కేరళలో మూడవ పాజిటివ్ కేసు కూడా  నమోదయింది . కరోనా వైరస్ పై పత్రికల్లో , మీడియా లో వస్తున్న వార్తలు చూసి, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు . ఇక సోషల్ మీడియా వదంతుల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు . హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోనే ఏకంగా 100 అనుమానితులు చేరినట్లు , వీరిలో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు . ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనను వేర్వేరుగా విడుదల చేశాయి .

 

కరోనా వైరస్ వల్ల  ఇప్పటికిప్పుడు ప్రజలకు  వచ్చిన భయమేమీ లేదని రెండు  రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ అధికారులు , కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది . కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు  కేంద్రం  అప్రమత్తమైంది . వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వం లో ఐదుమంది మంత్రులతో  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది . ఈ బృందం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోందని , ఇప్పటికే ఎక్కడిక్కడ ప్రత్యేక విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు . కేంద్రం అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్ ను నిర్ధారించే కిట్స్ పంపడం జరిగిందని చెప్పారు .

 

ఇక విదేశాల నుంచి వచ్చేవరకు అన్ని విధాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారిని అన్ని సౌకర్యాలు కలిగిన వైద్యకేంద్రం లో  పూర్తిస్థాయి వైద్యుల పర్యవేక్షణ లో ఉంచనున్నట్లు తెలిపారు . చైనా నుంచి దేశానికి చేరుకున్న పలువుర్ని ఇప్పటికే ప్రత్యేక వైద్య కేంద్రాల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు . చైనాకు వెళ్లి వచ్చిన  కేరళ కు చెందిన ముగ్గురికి ఇప్పటి వరకు వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: