కరోనా వైరస్ నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీకి సాయం చేసింది. అది ఎలా అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సిసలైన విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని అంత ఏదైనా గజగజ వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే.. ఎందుకు అంటే ఆ కరోనా వైరస్ అందరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.  

 

ఈ వైరస్ కారణంగా దాదాపు 300 మంది మరణించగా 10 వేలమంది ఆ వైరస్ భారిన పడ్డారు. అలాంటి వైరస్ నుండి మన భారతీయులను సేఫ్ గా భారత్ కు తీసుకువచ్చారు నరేంద్ర మోడీ. అయితే ఈ విషయంతో ప్రధాన మంత్రికి ఫిదా అయ్యి రెబల్స్ కూడా దగ్గర అవుతున్నారు.. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఇప్పుడు మళ్ళి కరోనా వైరస్ తో మోడీకి దగ్గర అవుతున్నారు. 

 

అవును.. మీరు విన్నది నిజమే.. నరేంద్ర మోడీపై చిర్రు బుర్రులు ఆడే సిన్హా ఇప్పుడు మోదీపై ట్విట్టర్ వేధికగా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అయన ట్విట్టర్ లో కరోనా వైరస్ గురించి స్పందిస్తూ.. మోదీని పొగిడారు. ''వుహాన్‌లో ఉన్న మనదేశస్థులను.. కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా.. బోయింగ్ 747 ప్రత్యేక విమానంలో మన దేశానికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెల్పుతూ.. ప్రధాని మోదీకి సెల్యూట్'' అంటూ ట్విట్ చేశారు సిన్హా. 

 

దీంతో ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కరోనా వైరస్ కలిపింది ఇద్దరినీ.. అంటూ నెటిజన్లు ట్విట్లు చేస్తున్నారు.. మరికొందరు స్పందిస్తూ.. శత్రువు అయినా సరే.. మంచి చేస్తే ప్రశంసించాలి.. అప్పుడే మనం మనుషులం అవుతాం'' అంటూ నెటిజన్లు ట్విట్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: