ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న రగడ ఇప్పటిలో తీరేలా లేదు. అక్కడ జరిగిన అవినీతి ఎంతో తెలియదు గాని...  నీ అవినీతి ఇంత అంటే, నీ అవినీతి ఇంతని కొబ్బరిచిప్ప కోసం కోతులు కొట్లాడినట్లుగా నాయకులు వాదులాటలే సరిపోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం పాలన చేస్తున్న నాయకుల్లో గాని,  చేస్తున్న రాజకీయాల్లో గానీ నీతి మంతులు, నైతికత పాటించే వారు దుర్బిణి పెట్టి వెదికినా కనిపించరు. వీరి ప్రవర్త ఎలా ఉందంటే గొంగట్లో కూర్చొని అన్నం తింటూ వెంట్రుకలను ఏరిన చందంగా రాజకీయ పార్టీల పరిస్థితి ఉంది.

 

 

మరకమంచిదే అన్నట్లు రాష్ట్రంలో అవినీతి మరక అంటని ఒక్క పార్టీ కూడా చుద్దామంటే కనిపించదు.. ఇకపోతే తాజాగా చంద్రబాబు కోపం నషాళానికి అంటినట్లుగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఘాటు వాఖ్యలు చేసారు. ఈ రగడ అంతా మూడు రాజధానుల గురించే.. ఇక  రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుపడుతూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం తుగ్లక్‌ చర్య అంటూ శేఖర్‌గుప్తా చెప్పిన వీడియో ప్రదర్శించారు.

 

 

ఇకపోతే తన గ్రామం వెళ్లి సభ పెట్టాల్సిన అవసరం మంత్రులకు ఏం వచ్చిందని, అసలు బుద్ధి ఉన్న వాడెవడైనా రాజధానికి అమరావతి వదిలేసి విశాఖపట్నం వెళతాడా అంటూ వ్యాఖ్యానించారు. తమ గ్రామం నుంచి వచ్చే వారు అమరావతి వదిలి విశాఖపట్నం వెళ్లరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. ఇదే కాకుండా పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఏపీ భవిష్యత్తును చీకటిలోకి నెట్టుతున్న ప్రస్తుత ప్రభుత్వ తీరు ఏం బాగోలేదని విమర్శించారు. ఏపీలో అధికార వికేంద్రీకరణవల్ల అభివృద్ధి జరగదని, పైగా మూడుచోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేయడంవల్ల భారం ఇంకా పెరుగుతుందన్నారు.

 

 

తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని చెప్పారు. ఇక గతంలో తనపై సీబీఐ కేసులు పెట్తిన తగిన ఆధారాలు సేకరించలేదని, కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో. విశాఖపట్నంలో వేల ఎకరాలు చేతులు మారాయని త్వరలో అవి బయటకు వస్తాయని బాబు తెలిపారు.. ఇక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పెట్టే సభలకు వెళ్లవద్దని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు... ఇప్పుడు బాబుగారు ఇంతలా స్పీచ్ ఇవ్వడానికి కారణం బాబుగారి బ్యాండ్ బాగా మోగుతున్నట్లు ఉంది. అందుకే కొత్త అపరిచితునిలా అవతారమెత్తి ఎన్నడులేనిది ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడే అని కొందరు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: