ప్రపంచమంతా ప్రస్తుతం గజగజ వణుకుతోంది. మందు తెలియని వ్యాధి వచ్చి మనల్ని ఏమైనా చేస్తుందేమో అని భయపడుతోంది. చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ తమ దేశాలకి కుడా వస్తుందేమోనని అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచం ఒక కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో రోగాలు ఒకచోటి నుండి మరో చోటికి వెళ్ళడం ఒక దేశం నుండి మరో దేశానికి ఫోన్ మాట్లాడినంత పని. 

 

చైనాలో ఈ వైరస్ బారిన పడి సుమారు 425 మంది మృతి చెందారు. ఆ దేశంలో మొత్తం 20,400 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో పలు నగరాలకు రవాణాను బంద్ చేశారు. వుహాన్ నగరంలోనైతే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ వైరస్ అంతానికి వ్యాక్సిన్ లేకపోవడమే కాదు దాని లక్షణాలకి టార్గెటెడ్ ట్రీట్ మెంట్ లేకపోవడం శాపంగా మారింది. రోజుకోసారి మొబైల్ లో యాప్ అప్డేట్ అయినట్లు కరోనా వైరస్ తనని తాను అప్డేట్ చేసుకుంటూ రోజుకో కొత్త రూపం ఏర్పర్చుకుంటుందట.

 

అందువల్లే ఈ వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టలేకపోతున్నారట. మనిషిగా ఎన్నో సాధించిన మనం చాలా గొప్ప అని ఫీల్ అయ్యే ప్రతీసారి... కాదు నేను తలుచుకుంటే నువ్వెంత అని ప్రతీ క్షణం ప్రకృతి గుర్తు చేస్తూనే ఉంది. చైనాలో ఈ వైరస్ బారిన పడ్డ వారికోసం తొమ్మిది రోజుల్లోనే  1000 పడకల ఆస్పత్రిని నిర్మించింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన ఆస్పత్రి నిర్మాణం చేపట్టి తక్కువ సమయంలోనే 1000 పడకల ఆస్పత్రిని నిర్మించిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది.

 

కేరళలో ముగ్గురు కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తేలింది. మన హైదరాబాద్ లో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించగా, వారికి పరీక్షలు నిర్వహించిన తర్వాత అటువంటిదేమీ లేదని తేలింది. మరో ముగ్గురు అనుమానితులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో వ్యాధులకి మందు కనిపెట్టిన మనం ఈ వ్యాధికి ఎప్పుడు మందు కనిపెడతామో! 

మరింత సమాచారం తెలుసుకోండి: