ధైర్య సాహసాలు ఉన్న వారిని మాత్రమే సంపద వరిస్తుంది అని అంటారు. అపారమైన జ్ఞానం అద్భుతమైన నైపుణ్యం సాధించాలనే గట్టి తపన ఉన్నా ధైర్య సాహసాలు లేని వ్యక్తి ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోలేడు. దీనితో విజయానికి అతడు ఆమడ దూరంలో నిలిచిపోవడంతో అతడు ఎంత ప్రయత్నించినా అతడి దగ్గర సంపద ఉండదు.

కొద్దిమంది సాహసవీరుల విజయ గాథలే ప్రపంచ చరిత్ర అని అంటారు. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ధైర్య సాహసాలు ఉంటే చాలు అదే పెద్ద సంపద. ఒక ఆటలో గెలవాలి అన్నా ఒక పర్వతాన్ని అధిరోహించాలి అన్నా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అన్నా మొదట్లో పరాజయాలు ప్రమాదాలు లేకుండా విజయం ఉండదు. అందువల్ల ఆపరాజయాన్ని తట్టుకోవాలి అంటే సాహసవంతులు మాత్రమే ఆ ధైర్యం చేయగలరు.

ఏ విషయంలో అయినా మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగదు. అందువల్ల జీవితంలో అనేక ఎదురీతలతో పాటు అనేక ఊహించని కష్టాలు కూడ ఉంటాయి. వాటాని ఎదుర్కుంటూ పోరాటం చేయగల శక్తి ఒక్క సాహస వంతులుకే ఉంటుంది. సంపద సృష్టి కోసం చేసే ప్రయత్నాలలో ఖచ్చితంగా రిస్క్ ఉండి తీరుతుంది. దీనితో మన ఆలోచనలు అన్నీ ప్రతిసారి మనం అనుకున్నట్టుగా అమలు చేయలేం.

ఇలాంటి పరిస్తితిలోనే ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ధైర్యం కావాలి. లాభాలు వస్తాయి అనుకుంటే నష్టాలు వచ్చే పరిస్థితులలో వ్యాపారంలో విజయం సాధించాలి అంటే ఆ వ్యాపారం చేసే వ్యక్తికి ఎంతో ఓర్పు ఉండాలి. ఖచ్చితంగా గెలిచి తీరాలి అని కోరుకునే ఆటగాడు 5 సంవత్సరాల తరువాత ఆడే ఆటకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాడు. పెద్ద విజయాలు ఎప్పుడు రిస్కున్న చోటునే ఉంటాయి. మన చేతిలో పెద్దగా డబ్బు లేనప్పుడు కొత్త ప్రయత్నాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అదే డబ్బు బాగా ఉన్న వ్యక్తి కొత్త ప్రయత్నాలకు రిస్క్ కు దూరంగా ఉంటాడు. అందువల్ల జీవితంలో విజయం సాధించాలి అంటే ప్రతి వ్యక్తి ఎదో ఒకచోట ఒకసారి సాహసం చేయవలసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: