వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం రోజు రోజుకు పోటెత్తుతుంది.. జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించు కుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.  ఇక ఈ నెల ఫిబ్రవరి 5 నుండి 8 వరకు మేడారం జాతర ఘనంగా జరుగనుంది.

 

 

ఇకపోతే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వెల్లడించారు. ఇదే కాకుండా ప్రభుత్వం జాతర అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించే సౌకర్యాల కోసం రూ.75 కోట్లను విడుదల చేసిందని. జాతర కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులతో శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ విషయంలో భక్తులకు ఎవరికి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకొని అందరికి సహాకరించాలని ఇప్పటికే కేసీయార్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.

 

 

ఇదే కాకుండా తెలంగాణ మంత్రులు కూడా అధిక సంఖ్యలో ఈ జాతరను సందర్శిస్తుండటం, ఇదే కాకుండా ఈనెల 7న సీఎం కేసీఆర్‌ కుటుంబంతో సహా అమ్మవార్ల దర్శనానికి వస్తుండడం, గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ సైతం అమ్మవార్ల దర్శనానికి వస్తుండడంతో పోలీసు క్యాంపులో గట్తి మందోస్తూ ఏర్పాటు చేశారు. ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా జాతరను దర్శించే నేపధ్యంలో తెలంగాణ మంత్రులకు మేడారం టెన్షన్ పట్టుకుందని అంటున్నారు కొందరు.

 

 

ఇక ఈ జాతరకు కోటిన్నరకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా జాతరలో 3450 మంది పారిశుధ్య కార్మికులతో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు. జాతర పరిసరాల్లో 4 అతిపెద్ద డంపింగ్‌యార్డులను, 300 మినీ డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇదే కాకుండా అవినీతికి తావు లేకుండా ఈ జాతర ఏర్పాట్లు పకడ్బంధిగా జరగాలని మంత్రులను కేసీయార్ హెచ్చరించినట్లు తెలుస్తుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: