ఈ మధ్య కాలంలో మనుసులు ఎలా మారుతున్నారంటే.. సినిమా ప్రభావం బాగా పెరిగిందని చెప్పాలి.. సినిమాలను చూసి ఎన్నో నేర్చుకున్నారు ఈ క్రమంలో పక్కన ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయాన్నీ తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఘోరం చోతు చేసుకుంది.. స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం వంట మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. వంట వండుతుండగా చిన్నారి ప్రమాదవశాత్తూ కూరగిన్నెలో పడిపోయింది. వంటమనిషి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ఉడికిపోయింది.

 

ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 60 శాతానికి పైగా కాలిన గాయాలతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన మీర్జాపూర్ పరిధిలోని రాంపూర్ అటారి గ్రామంలో జరిగింది. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ కూరగిన్నెలో పడిపోయింది. వంటమనిషి గమనించకపోవడంతో చిన్నారికి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో చిన్నారి పడిన పట్టించుకోలేని రీతిలో వంటమనిషి ఉండటం అది కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ పట్టించుకోకపోవడం బాధాకరమని సదరు వెల్లడిస్తున్నారు. చిన్నారిని గుర్తించిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 

చిన్నారి మృతి చెందింది.. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఈ విషయం పై కఠిన చర్యలు తీసుకుంది. పాఠశాలలో అడ్డదిడ్డంగా పడి ఉన్న నిర్మాణ సామగ్రి కారణంగానే చిన్నారి ప్రమాదవశాత్తూ ఉడుకుతున్న గిన్నెలో పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంటమనిషిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు గతం కూడా జరగడం పై ఆయా అధికారులు హెచ్చరికలు  జారీ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు కనీతి పర్యంతం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: