రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో భరోసా లభించడంతో ఇక జగన్ ఎటువంటి టెన్షన్ లేకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ  నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాబు ట్రాప్ లో పడిన రాజధాని ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా గత టిడిపి ప్రభుత్వం బాగా లబ్ధి పొందిందనే విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి రాజధాని రైతుల్లో మెల్లిమెల్లిగా  మొదలైనట్టు గా కనిపిస్తోంది.


 కేంద్రం ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై తాము అమరావతి కోసం పోరాటం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే భావనకు వచ్చిన రాజధాని రైతులు ఈరోజు ఏపీ సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తో కలిసి జగన్ ను కలిసిన రైతులు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించినట్లు తెలుస్తోంది. రాజధాని కోసం అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి భూములు ఇచ్చామని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరినట్టు తెలుస్తోంది. దీనిపై జగన్ అనుకూలంగా స్పందించినట్టు సమాచారం. 


ఇక కేంద్రం నిర్ణయం వైసీపీకి అనుకూలంగా ఉండటంతో మరికొద్ది రోజుల్లోనే అమరావతి ప్రాంతంలో చేపట్టిన ఆందోళనలు పూర్తిస్థాయిలో సర్దుమణుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సానుకూలంగా పరిష్కరిస్తామని జగన్ ప్రకటించారు. కొంత మంది తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపిస్తుండటం... జనసేన బీజేపీతో పొత్తు కారణంగా ఈ ఉద్యమం వైపు వచ్చేలా కనిపించకపోవడంతో మరో దారి లేక అమరావతి రైతులు జగన్ ను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: