ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ జగన్ అతి తక్కువ కాలంలోనే దేశంలోనే ఇతర రాష్ట్రాలను ప్రభావితం చేసే దిశగా తన పరిపాలన చేస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అదే తరుణంలో వృద్ధులకు పెన్షన్లు ఇంటివద్దకే పంపటం మరియు ‘అమ్మ ఒడి’ ద్వారా చదివించ లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయడం వంటి పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలవటం జరిగింది. అంతేకాకుండా స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అద్భుతమైన భోజనాన్ని అందిస్తూ పిల్లలకు పౌష్టికాహారం కలిగేలా మెనూ ని ప్రిపేర్ చేసి పిల్లల ఆరోగ్య విషయంలో కూడా జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

ఇంతగా పరిపాలన విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తూ పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఓ సర్వేలో దేశంలో నాలుగవ బెస్ట్ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించడం జరిగింది. అయితే తాజాగా మరొకసారి జాతీయ స్థాయిలో VDP అసోసియేట్స్ నిర్వహించిన మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు అనే సర్వేలో సిఎం వైయస్ జగన్ అన్నకి దేశంలో 3 వ స్థానం దక్కింది..దీంతో జాతీయ స్థాయిలో రోజురోజుకీ జగన్ కీ క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది.

 

జగన్ పరిపాలనలో నవరత్నాలు దేశ దృష్టిని ఆకర్షించినట్టు సర్వేలో వెల్లడైంది. దేశ్ కా మూడ్ పేరుతో VDP అసోసియేట్స్ నిర్వహించిన ఈ సర్వేలో జగన్ మూడో స్థానం దక్కించుకోవడం జరిగింది. కెసిఆర్ కంటే ముందు స్థానంలో జగన్ నిలవగా మొదటి స్థానంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆగస్టు 9వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వే మొత్తం దేశంలో 14 రాష్ట్రలో జరిగినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. దీంతో వైసీపీ పార్టీ నాయకులు మంత్రులు జగన్ కి మూడో స్థానం రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: