రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇస్తూ ఉంటారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆ హామీలను అమలు చేయరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొనివస్తానని 15 లక్షల రూపాయలు భారతీయుల ఖాతాలలో జమ చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ఇచ్చిన ఈ హామీని ప్రజలు కూడా విశ్వసించారు. 
 
2014 ఎన్నికల్లో చాలా మంది ప్రజలు మోదీ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నమ్మి బీజేపీ పార్టీకి ఓటు వేశారు. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీనే అధికారంలో ఉన్నా ఈ హామీని మాత్రం అమలు చేయలేకపోయింది. విపక్షాల నుండి ఈ హామీ విషయంలో తరచుగా మోదీ, అమిత్ షాను విమర్శిస్తూ ఉంటారు. ప్రధాని మోదీ, అమిత్ షా 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ప్రత్యేక కోర్టులో సెక్షన్ 420, 415, 123బీ సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై కోర్టు నిన్న విచారణ చేపట్టింది. తాను చేసిన ఫిర్యాదు గురించి హెచ్ కె సింగ్ మీడియాతో మాట్లాడుతూ " ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోతే వారిని మోసం చేసినట్లే అవుతుంది. తప్పుడు వాగ్దానాలు చేస్తే ప్రజల నుండి ఓట్లు పడవని గుర్తుంచుకోవాలి. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన సీఏఏ హామీని బీజేపీ ఇప్పుడు నెరవేరుస్తోంది" అని చెప్పారు. 
 
సీఏఏను అమలు చేస్తున్న కేంద్రం 2019 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పారని ఎందుకు ఆ హామీని అమలు చేయలేదంటూ హెచ్ కె సింగ్ ప్రశ్నించారు. న్యాయస్థానం హెచ్ కె సింగ్ ను గతంలోనే ఈ విషయంలోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. హెచ్ కె సింగ్ మాట్లాడుతూ మిగతా ప్రజల మాదిరిగానే తాను కూడా హామీని నమ్మి మోసపోయారని చెప్పారు. కానీ నిజం ఏమిటంటే ప్రధాని మోదీ 15 లక్షల రూపాయలు ప్రతి భారతీయుడి ఖాతాలో వేస్తానని స్పష్టమైన హామీని ఎప్పుడూ ఇవ్వలేదు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ వాగ్దానం గురించి మోదీ ప్రస్తావించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: