ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. మూడు రాజధానులు తెరపైకి తీసుకువచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని ఒకచోట అభివృద్ధి జరిగితే మళ్లీ రాష్ట్రం విడిపోతుందని పేర్కొనటం జరిగింది. దీంతో అమరావతి ప్రాంతంలో రాజధాని జగన్ తరలింపు కార్యక్రమం స్టార్ట్ చేశారని అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి. నేను అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆందోళనలు మరియు నిరసనలు దీక్షలు చేస్తూ జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని అమరావతిలో రాజధాని ఉంచాలని గత నెల రోజులకు పైగానే దీక్ష చేపట్టడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు నాయకులు రాజధాని ప్రాంతాలలో ధర్నాలు నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ఖండించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కి మూడు రాజధానులు కట్టడానికి అధికారం ఉందని వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు అన్నట్టుగా ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరారు.

 

రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని, మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం 15 ఏళ్లపాటు 50 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రంలో దేశ ప్రజలను విభజించే విధంగా తీసుకున్న నిర్ణయాలను కంచ ఐలయ్య ఖండించారు. దీంతో కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా ఏపీ రాజకీయాల్లో హైలెట్ హాట్ టాపిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: