మనదేశంలో ఎంతోమంది నాయకులు ఒక రాష్ట్రం లో పెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలను చూసి వాళ్ళ వాళ్ళ రష్ట్రాల్లో కూడా అమలుపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం చూసి చాలా చోట్ల అటువంటి హెల్త్ స్కీం లు మొదలవగా.... తమిళనాడులో అమ్మ క్యాంటీన్ లతో స్పూర్తిని పొందిన చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో 'అన్న క్యాంటీన్' లను తీసుకొని రాగా కేసీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్ ను తెలంగాణలో ఏర్పాటు చేశాడు. అయితే మన రాష్ట్రంలో చాలా మంది గ్రాడ్యుయేట్లకు కనీసం నెలసరి ఆదాయం అందే పరిస్థితి లేదు. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ 2017 లో ప్రవేశపెట్టిన లేబర్ చట్టం నుండి మనవాళ్ళు గనుక ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే తెలుగు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లే.

 

కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన చట్టం ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యువేట్ లకు కనీసం నెలకి 19 వేల రూపాయలు జీతంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కార్మికులకు కూడా కనీస వేతనాలుగా ఆయన భారీ మొత్తాన్ని నిర్ణయించారు. నైపుణ్యత లేని కార్మికుడికి కనీసం 14 వేల రూపాయలు, సగం నైపుణ్యం మరియు అర్హత ఉన్న కార్మికుడికి కనీసం 16 వేల రూపాయలు ఇకపోతే పూర్తి నైపుణ్యత కలిగిన వారికి 17 వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని కేజ్రివాల్ చట్టాన్ని తీసుకొని వచ్చాడు.

 

ఇకపోతే పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి కనీసం 14 వేల రూపాయలు మరియు ఇంటర్ చదివిన వారికి 16 వేల రూపాయలు ఇకపోతే డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరికి కనీస వేతనం పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని లేబర్ చట్టం తీసుకొని రాగా అనేక పరిశ్రమలు దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేశాయి. అయితే కోర్టు వారు దీనిలో తాము ఏమీ చేయలేమనిఇటువంటి నిర్ణయాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని.... వాటన్నింటినీ కచ్చితంగా పాటించి తీరాలని చెప్పడంతో దానికి తగ్గట్లు వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో సవరింపులు చేసుకున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే పద్ధతిని కొనసాగిస్తే ప్రజల భవిష్యత్తు బంగారు బాట వైపు నడుస్తుంది ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: