ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో అమరావతి ప్రాంత రైతులు ఢిల్లీలో ముఖ్యమైన నేతలను కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు అంశాన్ని వ్యతిరేకిస్తూ గత కొంత కాలం నుండి అమరావతి ప్రాంతంలో రాజధాని భూములు ఇచ్చిన రైతులు నిరసనలు దీక్షలు చేపడుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలవడంతో వారి మద్దతుతో ఢిల్లీలో ఉన్న పెద్దపెద్ద నేతల దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పడం జరిగింది.

 

అమరావతి ప్రాంతంలోనే రాజధాని కొనసాగించాలని భూములు ఇచ్చిన మేము నష్టపోతామని నేతల దృష్టికి అమరావతి రైతులు తీసుకెళ్లారు. ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిశారు. రాజధానిలో జరుగుతున్న ప్రభుత్వ ఆగడాలను వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వివరించారు. రాజధాని ప్రాంతంలో రైతులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందని పోలీసులు వేధిస్తున్నారని వెంకయ్యనాయుడు కు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మరొకసారి అమరావతి ప్రాంత రైతులు ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకు వెళ్లారట. ఈ విషయంలో మీరే కలుగజేసుకుని తగిన న్యాయం తీర్చాలని తమ సమస్యలను తెలియజేశారు అంట.

 

దీంతో ఈ విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని అమరావతి ప్రాంతంలో పర్యటించాలని డిసైడ్ అయ్యారట. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని...కేంద్ర ప్రభుత్వం చొరవ ఏమీ ఉండదని తెలియజేయడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరావతి ప్రాంత రైతుల విషయంలో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనకు వెంకయ్య నాయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు సమాచారం. ఇదే తరుణంలో అమరావతి ప్రాంతంలో దీక్షలు నిరసనలు చేస్తున్నా రైతులు కూడా నీరుగారిపోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: