తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల సినిమాల వేడుకలకు హాజరవుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండస్ట్రీకి భరోసా ఇస్తూ ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సర్కార్ అన్ని విధాల టాలీవుడ్ ఇండస్ట్రీకి సహాయపడుతుందని ఇండస్ట్రీలో ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని పిలుపునిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిష్కరించే విధంగా చేపడుతున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జునతో కలిసి చిరంజీవి ఇంటిలో భేటీ కావడం జరిగింది. తాజాగా జరిగిన ఈ భేటీలో వీటి మధ్య ప్రధాన నంది అవార్డులు మరియు సినిమా కార్మికుల సమస్య ఇండస్ట్రీ అభివృద్ధి గురించి చర్చలు జరిగినట్లు ముఖ్యంగా ఇండస్ట్రీ తరఫున ప్రకటించిన నంది అవార్డుల విషయంలో అనేక వివాదాలు నెలకొనడంతో వాటిపై కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి మరియు నాగార్జునతో చర్చించినట్లు సమాచారం.

 

ముఖ్యంగా వీటన్నిటికంటే అతి పెద్ద సమస్య పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో చిన్న సినిమాలను తొక్కే విధంగా థియేటర్ల సమస్య అధికంగా ఉంటుందని దీని వల్ల చిన్న చిత్రాల హీరో లు మరియు నిర్మాతలు నష్టపోతున్నారని వాళ్లకి ఇబ్బంది కలుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ నాగార్జున మరియు చిరంజీవి దృష్టికి తీసుకువచ్చారు. ఇదే తరుణంలో మా అసోసియేషన్ లో జరిగిన గొడవలు మరియు చిత్రపురి కాలనీ లో వివాదాలు ఇలా అనేక వివాదాల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్...ఇద్దరు హీరోలతో చర్చించటం జరిగినట్లు సమాచారం. కాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయికి వెళ్లాలని దానికి అన్ని విధాల తెలంగాణ సర్కార్ సహాయపడుతుందని ఇద్దరు హీరోలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: