జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో ది హిందూ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేష‌న్ స‌మావేశంలో ఇంగ్లీష్ మీడియంపై చాలా ఆస‌క్తిక‌ర ప్ర‌సంగం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఏపీలో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదన పెద్ద ఎత్తున కలకలం రేపిన సంగతి అందరికి తెలిసినదే. అయితే జగన్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలో సరైన సమాచారం బయటకు రాకపోవడం మూలాన ఈ మంచి నిర్ణయం సర్వత్రా అన్ని పార్టీల శ్రేణుల్లో విమర్శనా అంశంగా మారిపోయింది. 

 

ఒకటి విషయం చేయబోతే ఇంకోటి అయ్యినట్టు తాము ప్రవేశ పెట్టబోయే ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా తెలుగు ఉంటుంది అని వీరూ మొదట్లో ప్రతిపాదించలేదు. దీనితో వీరు ఏకంగా తెలుగు అనే భాషనే తీసేస్తున్నారు అన్న వార్తలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనితో ఇతర పార్టీల వారు నాన్ స్టాప్ గా వైసీపీ శ్రేణులను ఏకి పారేసారు. వీళ్ళేమో తెలుగు భాష మాధ్యమం కూడా ఉండాలి అంటారు వారేమో తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో తప్పకుండ తెలుగు భాషను ఉంచుతామని అంటారు.ఇలా సరైన సమాచారం లేని ఈ నిర్ణయం అన్ని పార్టీల్లోనూ కాస్త గందరగోళ వాతావరణం రేపింది. 

 

అయితే ఈరోజు విజయవాడలో జగన్ జరిపినటువంటి సభలో రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ కు ఎంత ఆవశ్యకత ఉంది అన్నది ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అది కనీస అవసరం అంటూ.. చాలా ఎమోషనల్ గా జగన్ చేసిన ప్రసంగించడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూనే తెలుగు సబ్జెక్టు కంపల్సరీ అంటూ సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాదని విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామన్నారు.ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని మాకు తెలుసు. ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం.. అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: