ఏపీ రాజ‌ధానిగా వైజాగ్ కొన‌సాగుతుందని... అమ‌రావ‌తి కంటే వైజాగ్ ఎందుకు బెస్టో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి తేల్చి చెప్పేశారు. బుధ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’కార్యక్రమం నిర్వహించారు. ది హిందూ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఇంగ్లీష్ మీడియం ఆవ‌శ్య‌క‌త‌ను మ‌రోసారి నొక్కి వ‌క్కాణించారు.

 

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణానికి 1.09 ల‌క్ష‌ల కోట్లు కావాలి.. గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో కేవ‌లం 5 వేల కోట్లే ఖ‌ర్చు పెట్టింది.... ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తిలో మౌళిక సౌక‌ర్యాలు క‌ల్పించాలంటే ప్ర‌తి ఎక‌రాకు రు.2 కోట్లు కావాల‌ని.. కానీ అమ‌రావ‌తిని సింగపూర్‌, జ‌పాన్ చేసేంత డ‌బ్బు మ‌న ద‌గ్గ‌ర లేద‌ని చెప్పేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో బాహుబ‌లి గ్రాఫిక్స్‌లు చూపించి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని.. తాను ఏం చేస్తానో అదే చెపుతాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు.

 

ఇక పోల‌వ‌రం రివ‌ర్స్ టెండరింగ్‌లో రు.830 కోట్లు ఆదా చేశామ‌ని కూడా జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఐదేళ్లుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో రాజ‌ధాని పేరుతో ఎన్నో మోసాల‌కు పాల్ప‌డింద‌ని కూడా చెప్పారు. ఇక గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ప్ర‌తిసారి అమ‌రావ‌తిని సింగ‌పూర్ చేస్తా.. జ‌పాన్ చేస్తా... ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల స‌ర‌స‌న నిలుపుతాను అని చెపుతూ కాలం గ‌డిపేసిన చంద్ర‌బాబు ఇప్పుడు జ‌గ‌న్ చెపుతోన్న వాస్త‌వాల‌తో క‌ళ్లు తేలేయాల్సిన ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు.  

 

ఏదేమైనా ఇప్ప‌ట‌కీ అయినా ఈ విష‌యంలో చంద్ర‌బాబు, టీడీపీ గ్యాంగ్‌, ఎల్లో మీడియా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తూ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు సాయం చేస్తారా ?  లేదా ?  అర్థం ప‌ర్థం లేని వాద‌న‌లు వినిపిస్తూ.. ప్ర‌జ‌ల్లో లేనిపోని అపోహ‌లు క్రియేట్ చేస్తూ అలా సంతృప్తి ప‌డ‌తారా ? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఇక ఇదే స‌మావేశంలో పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్ ప్ర‌శంసించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: