ఆడవాళ్ల పట్ల లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆఫీస్ లో, బయట, ఇంట్లో, పనిచేసే స్థలాలో ఎక్కడ పడితే అక్కడ ఆడవారి మీద లైంగిక వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అభివృద్ది విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున మనం ఆడవాళ్ల భద్రత విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. ఆడవారిని వేధిస్తే ఎన్నో శిక్షలు వేయడానికి చట్టాలు ఉన్నప్పటికీ ఇంకా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.

 

 

 

మొన్నటికి మొన్న నిర్భయ నిందితుల విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలవుతున్నా కూడా నిందితులకి ఉరిశిక్ష అమలు కాకపోవడం మన చట్టాల్లో ఉన్న లోపాలని చూపిస్తుంది. అయితే ఆడవాళ్లని మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఒక కేసుకి సంబంధించిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  చిన్మయానంద గురించి అందరికీ తెలిసిందే.

 

 

 

చిన్మయానంద గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆ అమ్మాయి కేసు కూడా వేసింది. అయితే ఈ కేసు విషయంలో క్విడ్ ప్రో ఉందని కోర్ట్ తేల్చి చెప్పింది. అంటే అవి వేధింపులు కావనీ, ఆ అమ్మాయి ఇష్ట పూర్వకంగానే అతనితో సన్నిహితంగా ఉంటోందని, దానికి మూల్యంగా ఆమె అతని దగ్గరి నుండి కావాల్సినవి తీసుకుందని చెప్తుంది

 

 

 

ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నప్పుడు అది వేధింపుల కేసు అవదని సమాచారం. ఇప్పటికైతే ఈ కేసు విషయమై ఇంకా తుది తీర్పు వెలువడలేదు. కానీ ఈ క్విడ్ ప్రో వల్ల చాలా కేసులు ఈ విధంగానే అయ్యే అవకాశం ఉంది. అయితే వాటిల్లో ఏది నిజమనేది తీర్పు వెలువడితే కానీ చెప్పలేం 

మరింత సమాచారం తెలుసుకోండి: