రాజకీయాలను ఎదుర్కోవాలని అంటే చాలా దైర్యం కావాలి. ప్రతి సమస్యను ఎదుర్కొని పరిష్కరించే సామర్థ్యం ఉండాలి. రాజకీయంలో ఎత్తు, పల్లాలు ఉంటాయి. వాటిని చక చక్యంగా వ్యవహరించిన వారే రాజకీయ రంగంలో రాణిస్తుంటారు. రాజకీయాల్లో కొన్ని సార్లు దొంగ పనులు చేయాల్సి వస్తుంది. అధికారం చేజిక్కించుకోవడానికి, అధికారం కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు. అలాంటి రాజకీయమే తెలంగాణ  మున్సిపల్ ఎన్నికల విషయంలో టీఆర్‌‌యస్ పార్టీ పాటించింది. 

 

తెరాస పార్టీ అనుకున్నట్టుగా పక్కాగా ప్లాన్ ను అమలు చేసి సక్సెస్ సాధించింది. ఇలా చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు చేసి ఇప్పుడు ఇరకాటంలో పడింది. తుక్కుగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో తక్కువ వార్డులు గెలుచుకున్నా, మున్సిపాలిటీని ప్రతిపక్షానికి పోనివ్వకుండా హస్తగతం చేసుకుంది. ఇదే ఇప్పుడు తంటాలు తెచ్చిపెట్టే విధంగా మారింది.

 

తుక్కుగూడలో మొత్తం 15 కౌన్సిర్లకు 9 చోట్ల బీజేపీ విజయం సాధించింది. బీజేపీ రెబల్ ఒకరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. తెరాస పార్టీ 5 చోట్ల విజయం సాధించింది. కానీ, తెరాస పార్టీ అనూహ్యంగా రంగంలోకి ఎక్స్ అఫిషియో సభ్యులను రంగంలోకి దించింది. ఈ సభ్యుల ఓటింగ్ తో, ఇండిపెండెంట్ అభ్యర్థిని చైర్మన్ ను చేస్తూ తెరాస పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఇదే ఇప్పుడు తెరాస పార్టీకి ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్న కేకే తెలంగాణలో ఎలా ఓటు వేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేకే ఓటును సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఒకవేళ తీర్పు బీజేపీకి అనుకూలంగా వస్తే కేకేపైన, ఓటు వేసేందుకు అంగీకరించిన రిటర్నింగ్ అధికారిపైనే వేటు పడే అవకాశం ఉంటుంది. మరి దీనిపై తెరాస పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ. కెసిఆర్ ఇలాంటి రాజకీయాలు చేస్తారని ఎవరూ ఎప్పుడు అనుకోని ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: