ప్రత్యర్ధులపై బురద చల్లే విషయంలో తెలుగుదేశంపార్టీ ఎంత స్ధాయికైనా దిగజారిపోతుందనేందుకు ఇదే తాజా నిదర్శనం. రాజ్యసభ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతిపై టిడిపి చర్చించటం సంచలనంగా మారింది. రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కోవటంలో  చంద్రబాబునాయుడుతో సహా పార్టీ నేతలందరూ విఫలమయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే.  దాంతో ఎలాగైనా జగన్ పై బురద చల్లేందుకు టిడిపి చవకబారు రాజకీయానికి తెరలేపింది.

 

రాజ్యసభ సమావేశాల సందర్భంగా టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జగన్ పై 11 అవినీతి కేసులు ఉన్నాయంటూ మొదలుపెట్టారు. కేసుల సందర్భంగా విచారణకు కూడా హాజరుకాలేనంటూ కోర్టులో పిటీషన్ కూడా వేసిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు కనకమేడల గుర్తు చేశారు. నిజానికి రాజ్యసభ సమావేశాలకు జగన్ అవినీతికి ఎటువంటి సంబంధం లేదు.

 

సభలో సభ్యుడు కానీ వ్యక్తి గురించి ఆ సభలో ఎటువంటి ప్రస్తావన తేకూడదన్న విషయం టిడిపి సభ్యుడికి బాగా తెలుసు. కౌన్సిల్ సభ్యుడి గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే స్పీకర్ అనుమతించరు. అలాంటిది ఓ ముఖ్యమంత్రి గురించి ఉద్దేశ్యపూర్వకంగా రాజ్యసభలో కనకమేడల ప్రస్తావించారంటేనే ఆయనలో  ఎంత అక్కసు పేరుకుపోయిందో  తెలిసిపోతోంది.

 

కనకమేడల ముఖ్యమంత్రిపై ఉన్న అవినీతి కేసులు, కోర్టు విచారణపై ప్రస్తావన తేగానే రాజ్యసభ ఛైర్మన్ వెంటనే  ఎంపిని అడ్డుకున్నారు. సభలో ప్రస్తావించాల్సిన అంశాలు మాత్రమే మాట్లాడాలని మిగిలిన విషయాలు అప్రస్తుతమంటూ స్పష్టంగా చెప్పేశారు. అయినా కనకమేడల మాత్రం జగన్ గురించి ప్రస్తావిస్తునే ఉన్నారు. సరే వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి కూడా టిడిపి ఎంపి ప్రసంగాన్ని  అడ్డుకున్నారు లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయంగా జగన్ ను రాష్ట్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు, టిడిపి నేతలు చేతులెత్తేశారు. దాంతో వారిలో జగన్ పై ఉక్రోషం పేరుకుపోతోంది.  ఏమి చేయాలో అర్ధంకాని స్ధితిలో ఎలాగైనా బురద చల్లాలన్న కసితో రాజ్యసభలో జగన్ పేరును కావాలనే ప్రస్తావించినట్లు అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: