వల్లభనేని వంశీ...టీడీపీ నుంచి గెలిచిన వైసీపీ అనుబంధ ఎమ్మెల్యే. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో...రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. రాజకీయ జీవితాన్ని టీడీపీలో ప్రారంభించిన వంశీ...2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో గన్నవరం టికెట్ దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, 2019 లో కూడా టీడీపీ నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే టీడీపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో అనూహ్యంగా జగన్‌కు మద్ధతు తెలిపారు. కాకపోతే వైసీపీలో చేరకుండానే, ఆ పార్టీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

 

అయితే వంశీ ఏ పార్టీలో ఉన్న ఈ 8 నెలలు గన్నవరంలో ఎలాంటి అభివృద్ది చేశారనే విషయం గురించి ఒక్కసారి మాట్లాడితే...వంశీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఇది సమస్య అని చెబితే...వాటి పరిష్కారానికి వంశీ కృషి చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు నేరుగా తన ఇంటి వద్దకే వచ్చి సమస్యలు చెప్పుకునే వీలు కల్పించారు. అలాగే ఎన్నో ఏళ్లుగా మొదలు కానీ బుడమేరు కాలువపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేసుకున్నారు.

 

ఇక వంశీ ఎలాగో అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉండటంతో, నియోజకవర్గంలో పలు పనులకు నిధులు త్వరగా వస్తున్నాయి. నియోజకవర్గాలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి దాదాపు 35 కోట్లు మంజూరు అయ్యాయి. అదేవిధంగా కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి చేత ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు కూడా గన్నవరంలో సంతృప్త స్థాయిలోనే అమలు అవుతున్నాయి.

 

అయితే టీడీపీ నుంచి గెలిచిన వంశీ పట్ల నియోజకవర్గ ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అర్ధం కాకుండా ఉంది. అటు విజయవాడకు దగ్గర ఉండటంతో ఇక్కడ రాజధాని ప్రభావం కూడా బాగానే ఉంది. ఈ ప్రభావం ఎలా ఉందో తెలియయాలంటే స్థానిక సంస్థల ఫలితాలు బట్టి తేలిపోతుంది.  ప్రస్తుతానికైతే పార్టీ మారినా, వంశీ ప్రజలకు సేవ చేసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: