రాష్ట్ర బిజెపిలో పెద్దాయనగా చెప్పుకునే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరువు ఒక్కసారిగా నేలబారుకు పడిపోయింది. పార్టీ జాతీయ  అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు చేసిన తాజా ప్రకటనతో వెంకయ్య పరువు ఒక్కసారిగా ఢిల్లీ వీధుల్లో పడిపోయింది.   జీవిఎల్  మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులు ఢిల్లీలో ఎవరిని కలిసినా ఎటువంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పేశారు. ఏదో పెద్దలను కలిస్తే కలివచ్చేమో కానీ వారికి కేంద్రం నుండి ఎటువంటి సాయం అందదని స్పష్టంగా చెప్పేశారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలనే డిమాండ్ తో  అమరావతి ప్రాంతంలోని కొందరు రైతులు, జేఏసి నేతలు ఢిల్లీలో మకాం వేశారు. వరుసబెట్టి కేంద్రప్రభుత్వంలోని కొందరు పెద్దలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా కలిశారు. వారితో భేటి అయిన వెంకయ్య వాళ్ళకు హామీ కూడా ఇచ్చారు. రాజధాని విషయంలో రైతుల డిమాండ్లకు తగ్గట్లే తాను కేంద్రంలో  ఎవరికి చెప్పాలో వాళ్ళకు చెబుతానన్నారు.

 

అంటే రైతులకు వెంకయ్య ఇచ్చిన హామీలో కొత్తేమీలేదు. విజయవాడ పర్యటనలో కూడా తనను కలిసిన రైతులకు ఇదే విధంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. వెంకయ్య హామీ ఇచ్చారంటే ప్రధానమంత్రితోనో లేకపోతే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తోనో చెబుతారని రైతులు అనుకుంటారు. అదే విషయాన్ని జీవిఎల్ స్పష్టం చేశారు. ఎవరు ఎటువంటి హామీ ఇచ్చినా కంటి తుడుపు మాటలే కానీ  వాస్తవంలో అలా జరగదంటూ తేల్చిపడేశారు.

 

రాజధాని ఎక్కడ పెట్టాలన్న విషయం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి కేంద్ర జోక్యం ఏమీ ఉండదంటూ మరోసారి స్పష్టంగా చెప్పారు. ఫెడరల్ వ్యవస్ధలో ఒకళ్ళ అధికారంలో మరొకళ్ళ జోక్యం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని అంశం రాష్ట్రపరిధిలోనిది కాబట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డినే కలిసి మాట్లాడుకోమంటూ సలహా కూడా ఇచ్చారు. దాంతో రైతులకు వెంకయ్య ఇచ్చిన హామీ ఉత్త కంటితుడుపు మాటలుగానే తేలిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: