కేసీఆర్ కేబినెట్లోకి కొత్త ఐటీ మంత్రి రానున్నారా ? ప‌్ర‌స్తుతం ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ భ‌విష్య‌త్తులో తెలంగాణ సీఎం అవుతార‌ని కొంద‌రు.. మ‌రి కొంద‌రు డిప్యూటీ సీఎం అవుతారంటూ ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు కీల‌క నేత‌లు సైతం కేటీఆర్‌కు సీఎం అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయంటూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. ఇక రెండు రోజులుగా కేటీఆర్ ఉప ముఖ్య‌మంత్రి అవుతార‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

 

మ‌రి కేటీఆర్ డిప్యూటీ సీఎం అవుతార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో మ‌రో స‌రికొత్త ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే తెలంగాణ‌కు కొత్త ఐటీ మంత్రి. కేర‌ళ ఐజీ జీ.ల‌క్ష్మ‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా చేరుతార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ల‌క్ష్మ‌ణ్ కేర‌ళ కేడ‌ర్‌కు చెందిన 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 46 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఆయ‌న ఓ మ‌ళ‌యాళీ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను కేసీఆర్ కేబినెట్లో చేరుతున్న‌ట్టు చెప్పార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

 

అలాగే ల‌క్ష్మ‌ణ్ త‌న‌కు కేసీఆర్ కేబినెట్లో ఐటీ మంత్రి ద‌క్క‌వ‌చ్చి కూడా చెప్పిన‌ట్టు టాక్‌..?  ల‌క్ష్మ‌ణ్ ఈ విష‌యాన్ని గ‌తంలోనే కేర‌ళ పోలీస్ చీఫ్ లోక‌నాథ్ బెహ‌రాకు చెప్పాన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించిన‌ట్టు టాక్‌. ల‌క్ష్మ‌ణ్‌కు మ‌రో 14 ఏళ్ల స‌ర్వీస్ ఉన్న‌ప్ప‌ట‌కీ ఆయ‌న రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న బంధువులు ప‌లువురు రాజ‌కీయాల్లో ఉన్నారు.

 

ఖ‌మ్మం జిల్లాకు చెందిన ల‌క్ష్మ‌ణ్ కు 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ఆయ‌న అల‌పూజ ఎస్పీగా త‌న కెరీర్ ప్రారంభించారు. అయితే ఇందుకు ఆయ‌న అంగీక‌రించ‌లేదు. కేర‌ళ పోలీస్ విభాగంలో కూడా ఆయ‌న ప‌నిచేశారు. ల‌క్ష్మ‌ణ్ ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర మాజీ డీజీపీ డీటీ నాయ‌క్ కుమార్తె డాక్ట‌ర్ క‌విత‌ను పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: