ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతామని మాట ఇవ్వటం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. పార్లమెంటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలందరూ రాజీనామా చేయాలని వెంటనే ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని కేంద్రాన్ని మెడలు వంచాలని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలతో అప్పట్లో కాకపుట్టించాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగానే పట్టుకున్న పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన సపోర్ట్ రాకపోవటంతో దాని పక్కన పెట్టినట్లు మీడియా సమావేశాలు అనేకసార్లు తెలపడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం ఏపీ రాజధాని అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా సరికొత్తగా సంచలన నిర్ణయం ఏపీ రాజధాని విషయంలో తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మేటర్ లోకి వెళితే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతుల ఆవేదన దేశవ్యాప్తంగా వినబడేలా చేస్తానని వారి బాధలను చేసిన త్యాగాలను దేశం నలుమూలలా వ్యాపించేలా నినదిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పిబ్రవరి తర్వాత రాజదాని ప్రాంతంలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. రైతుల ఉద్యమ స్పూర్తి చూసి తెలుగువారు గర్విస్తున్నారని ఆయన అన్నారు.

 

రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33వేల ఎకరాలు ఇచ్చి.. ఇప్పుడు రోడ్డున పడ్డ రైతన్నలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అవలంబిస్తున్న వైఖరి చాలా దారుణమని ఈ విషయంలో దేశం మొత్తం మద్దతు కూడగట్టుకొని అమరావతి ప్రాంత రైతులకు అండగా నిలబడతాం అని పవన్ కళ్యాణ్ తాజాగా తన ప్రకటనలో తెలపడం జరిగింది. దీంతో త్వరలోనే అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించ బోతున్నట్లు జనసేన పార్టీ వర్గాల్లో టాక్.

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: