ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఒకపక్క ప్రజా సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని సమపాళ్ళలో నడిపిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా బెస్ట్ చీఫ్ మినిస్టర్ ల లో ఒకసారి నాలుగో స్థానంలో తాజాగా ఇటీవల మూడవ స్థానంలో వచ్చిన జగన్ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ అవినీతి జరగకూడదని పగడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇసుక పాలసీ విధానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న విధానం నెంబర్ వన్ అని కేంద్ర మంత్రి పొగడటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇసుక పాలసీ అమలు లో ఎక్కడ అవినీతి జరిగిన ఊరుకునే ప్రసక్తి లేదని సీఎం జగన్ కలెక్టర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 

ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వచ్చిన ఊరుకునే ప్రసక్తి లేదని అన్ని జిల్లా కలెక్టర్లను ఇసుక పాలసీ విధానం లో అలసత్వం వహించడం అని జగన్ సూచించారు. చిన్న పొరపాటు జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. అంతేకాకుండా నూతన ఇసుక విధానం దేశంలోనే రోల్‌మోడల్‌ అన్నారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు జగన్‌. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా... ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు.

 

ఎక్కడా కూడా అటువంటి చర్యలు ఏ జిల్లాలో జరగకూడదని అందరూ చాలా సీరియస్గా కలెక్టర్లు పనిచేయాలని జగన్ తెలిపారు. అంతేకాకుండా రాబోయే స్పందన సమావేశం నాటికి ఇసుక విధానం విషయంలో పక్కా సమాచారంతో కలెక్టర్లు అందరూ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.  ఇంకా అనేక విషయాల గురించి కలెక్టర్లతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్..ఇసుక డోర్ టు డోర్ డెలివరీ అనే విధానం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంలో ఎక్కడ పొరపాటు జరగకూడదని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: