ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం.. ఎన్నాళ్లుగానో చెబుతున్న మాట ఇది. కానీ అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడవుతుంది.. ఈ ప్రశ్నకు బదులు ఏ నాయకుడూ చెప్పలేడు. అయితే మన ఇండియా గ్రేట్ అంటూ ఉకదంపుడు ఉపన్యాసాలు ఇమ్మంటే మాత్రం ముందుంటారు. కానీ ఏపీ సీఎం జగన్.. మన ఇండియా లోపాలను నిర్మోహమాటంగా ఎత్తి చూపించారు. అదేంటంటే.. ఏపీలో నిరక్షరాస్యతా శాతం 2011 లెక్కల ప్రకారం 33% ఉంది.

 

 

ఇది దేశీయ సగటు 27% కంటే ఎక్కువ. 18 నుంచి 23 ఏళ్ల వయసు పిల్లలు కాలేజీల్లో చేరే శాతాన్ని గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో అంటాం. తరుచూ మనం బ్రిక్స్ దేశాలైన బ్రెటిల్, రష్యా, చైనాలతో పోల్చుకుంటూ ఉంటాం. రష్యాలో 81% మంది పిల్లలు కాలేజీల్లో ఎన్‌రోల్ అవుతున్నారు. చైనా, బ్రెజిల్ దేశాల్లో ఇది 50% ఉంటే మన దేశంలో GER కేవలం 23% ఉంది. అంటే మన దేశంలో 77% మంది పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్లడం లేదు. కారణం ఏమిటని అన్వేషిస్తే కొన్ని చేదు వాస్తవాలు కనిపిస్తాయి.

 

 

ఇప్పుడు అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. సెల్‌ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఐపాడ్ ఉపయోగిస్తున్నారు. వీటిని వాడేందుకు మనం ఏ భాష వినియోగిస్తున్నాం. ఇంటర్నెట్ లో వాడే భాషేమిటి. ఇంగ్లీష్ మాత్రమే అంటూ ఇంగ్లీష్ ప్రాముఖ్యత వివరించారు జగన్. ఇవాళ ఇంగ్లీష్ అనేది విలాసం కాదు అవసరం అయ్యింది. మన పిల్లలకు మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి జీతం కావాలన్నా వాళ్లు ఈ ప్రపంచంతో పోటీపడాలి. ఇరవై ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే నేడు ఎలా ఉంది? ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది?

 

నేడు మనం ఆర్టిఫిషల్ ఇంటిలిజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. త్వరలో డ్రైవర్లు కూడా ఉండరు అని మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి అత్యాధునిక కాలంలో ఉంటూ ఇంగ్లీష్ మీడియం వద్దని అనగలమా? రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే.. అంటూ సమస్యకు పరిష్కార మార్గం సూచించారు ఏపీ సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: