ఏపీ సీఎం జగన్.. తన మంత్రి వర్గంలోని ఓ మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.. ఆయన ప్రత్యేకతను సభ ముందు చాటారు. అడగకపోయినా.. ఆయన ప్రాముఖ్యతను అందరికీ చాటారు.. ఇంతకూ ఎవరా మంత్రి.. ఆయన గురించి జగన్ ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పారు.. అంత అవసరం ఏమి వచ్చింది. నిజంగా ఆ మంత్రి అంత గ్రేటా.. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.

 

విజయవాడలో హిందూ పత్రిక నిర్వహించిన సదస్సుకు హాజరైన జగన్ కు హిందూ మాజీ ఎడిటర్ రామ్ నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.. మీరు ఉన్నవాటిలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం విషయంలో ఏం చేయబోతున్నారు ? అని ఎన్ . రామ్ అడిగారు. దీనికి జగన్ సమాధానం ఇస్తూ.. ” దీనిపై మా మంత్రి మాట్లాడతారు.. అంటూ తన విద్యాశాఖ మంత్రి గురించి చెప్పారు.

 

మా విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గురించి మీకు ప్రత్యేకింగా చెప్పాలి. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో పనిచేసిన అనుభవం కల వ్యక్తి. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దళితుడు, సామాజిక మార్పును కోరుకునే వాడు. అందుకే ఆయన్ను కావాలని.. విద్యాశాఖా మంత్రిని చేసాం. మేము ఆశిస్తున్న మార్పును ఆయనే ముందుండి నడిపిస్తారు.. అంటూ ఆదిమూలపు సురేశ్ గురించి ప్రశంసించారు.

 

సీఎం ఇంకా ఏమన్నారంటే.. “ ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి టీచర్ల ట్రైనింగ్ కోసం ఓ కరిక్యులమ్ తయారు చేసాం. ప్రాధమికంగా జిల్లాకు 20 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. ఒకపక్క టీచర్లకు ట్రైనింగ్ కరిక్యులమ్ తో పాటు మరోవైపు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేస్తున్నాం. వెట్రి శెల్వన్ అనే యువ ఐఎఎస్ ఆఫీసర్‌ను ఇంఛార్జ్‌గా నియమించాం. ఈ అంశాలకు సంబంధించి అన్ని విషయాలను ఆమె వివరిస్తారు.. అంటూ చెప్పుకొచ్చారు జగన్. అలా ఆయన తన మంత్రి వర్గ సహచరుడి గురించి గొప్పగా చెప్పిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: