ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి శరవేగంగా ముందుకు అడుగులు వేస్తోంది జగన్ సర్కార్. ఇప్పటికే వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలుపగా.. ఈ బిల్లుకు  శాసనమండలి ఇబ్బందులు సృష్టించడంతో శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకున్నది జగన్ సర్కార్. రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని అటు టిడిపి కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో అమరావతి అంశంపై మాట్లాడారు. 

 

 

 రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే  సమయం లో అమరావతి పై ప్రసంగించడంతో గల్లా జయదేవ్ స్పీకర్ అభ్యంతరాలను పార్లమెంట్లో చవిచూశారు. పార్లమెంటు సమావేశం అనంతరం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని పరిస్థితులు సరిగా లేనప్పుడు ఇక దేశ పరిస్థితుల గురించి ఏమని మాట్లాడుతాను  అంటూ వ్యాఖ్యానించారు. అందుకే పార్లమెంటులో అమరావతి గురించి మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ రాజధానిగా అమరావతి లో ఎన్నో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు జరిగి  పాలనకు సిద్ధమవుతున్న తరుణంలో.... అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాజధాని తరలింపు నిర్ణయం తీసుకోవడం అర్థరహితం అంటూ విమర్శించారు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్. 

 

 

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయం వల్ల ఆంద్రప్రదేశ్ వేల కోట్ల పెట్టుబడి దూరమయ్యే పరిస్థితి వచ్చింది అంటూ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మరో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... వైసీపీ పార్టీకి ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ కూడా... ఎన్నికల ముందు జగన్ సర్కార్ ప్రత్యేక హోదా తీసుకొస్తా అని హామీ ఇచ్చినప్పటికీ కూడా... ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు.. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడడం లేదు అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్  ప్రయత్నిస్తుంది అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: