అది ఎలాంటి వార్తయినా సరే.. దాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చాలి.. ఆ వార్తలో అసలైన పాయింట్ ఏమున్నా సరే..మనం టీడీపీకి అనుకూలంగా ఉన్న పాయింటునే హైలెట్ చేయాలి.. చదివే పాఠకుడికి పిచ్చెక్కిపోవాలి.. ఆహా.. భళా చంద్రబాబూ అనిపించాలి.. బహుశా ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టార్గెట్ అయి ఉండాలి. ఎందుకంటే.. చంద్రబాబుకు దిమ్మ తిరిగే వార్త వచ్చినా సరే.. దాని ప్రజెటంటేషన్ మాత్రం ఆంధ్రజ్యోతితో డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది.

 

నమ్మమంటారా.. అయితే ఈ వార్త చూడండి.. మొన్నటికి మొన్న.. రాజధాని విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ నిర్ణయాధికారం అని కేంద్రం పార్లమెంటులో జవాబిచ్చింది.ఆ ప్రకటన చేసింది సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్. అంటే అది కేంద్రం వాయిస్.. వాస్తవానికి ఈ ప్రకటన చంద్రబాబుకు దిమ్మ తిరిగే వార్త. రాజధాని మార్పు విషయంలో మాకు సంబంధం లేదు అని ఖరాఖండీగా చెప్పేయడమే.

 

మరి ఈ వార్తను ఎలా ప్రజెంట్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు రాస్తే.. మన చంద్రబాబుకు ఇబ్బంది కదా.. మరి చంద్రబాబుకు ఇబ్బంది కలిగేలా మనం వార్త ఎలా రాస్తాం.. చస్తే రాయకూడదు. అలాగని ఈ వార్త ఆపకూడదు.. ఇలాంటి చిక్కుతో ఆంధ్రజ్యోతి భలేగా ఇబ్బంది పడింది. అయితే మనసుంటే మార్గం ఉంటుంది కదా. అందుకే ఆ కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానాన్ని ఆసాంతం చదివింది.

 

హమ్మయ్య ఒకటి రెండు పాయింట్లు దొరికాయి.. ఈ కోణం రాస్తే బాబు గారిని సేవ్ చేయొచ్చు.. కానీ మన పాఠకులను మరీ పిచ్చోళ్లను చేసినట్టు ఉంటుంది కదా.. అన్న అనుమానం వచ్చింది. అయినా పర్వాలేదు. మనం పాఠకులిని పిచ్చోళ్లను చేసినా పర్వాలేదు.. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్త రావడానికి వీల్లేదని పాపం.. భీష్మించుకున్నట్టున్నారు. ఇక రాయడం మొదలుపెట్టారు.

 

2015లో రాజధానిగా అమరావతిని నోటిఫై చేసినట్టు కేంద్ర మంత్రి చెప్పాడు కాబట్టి ఇన్నిరోజులూ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయలేదనే జగన్ గ్యాంగు వాదన వీగిపోయిందనేది ఓ పాయింట్ .. ఇంకేం ఇది చంద్రబాబుకు సూపర్ విజయం అని రాసిపారేయొచ్చు.. అలాగే.. ‘తమ రాష్ట్రం పరిధిలో ఇష్టమొచ్చినచోట ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం చెప్పింది.. కానీ ఎక్కడా రాజధానులు అని చెప్పలేదు కదా.. కాబట్టి మూడు రాజధానులకు కేంద్రం అంగీకరించలేదు అన్నట్టుగా అర్థం చేసుకోవాలని రాసిపారేసింది. అబ్బా.. ఏం బుర్రబాసూ నీది.

మరింత సమాచారం తెలుసుకోండి: