ఒక‌ప్పుడు ఆడ‌పిల్ల‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా సంకోచించేవారు. అలాగే న‌లుగురితో క‌లిసి మాట్లాడ‌టానికి, మెల‌గ‌టానికి కొంత టైం ప‌ట్టేది. అలాంటిది ఇప్పుడు రాకెట్‌లాగా దూసుకుపోతున్నారు. అది ఏ విష‌యంలోనైనా స‌రే. మ‌న సంస్కృతి సంప్రదాయాల‌ను మ‌రిచి. పాశ్చాత్య సంస్కృతికి అల‌వ‌డుతున్నారు. మ‌రి ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి వారి జీవితాల్ని కోల్పోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఘ‌ట‌నే ఇటీవ‌లె ఒక‌టి బెంగుళూరులో చోటు చేసుకుంది.

 

మ్యాట్రిమోనీ ద్వారా ప‌రిచ‌యమై ఇద్ద‌రు 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన ద‌గ్గ‌ర నుంచి ఈ దంప‌తులిద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే శారీర‌క సుఖంలో కొత్త యాంగిల్స్‌లో ఎంజాయ్ చేయ‌ల‌నే ఉద్దేశంతో భార్య భ‌ర్త‌ను పోర్న్ వెబ్ సైట్స్ చూడ‌మ‌ని ఒత్తిడి తెచ్చేది. కానీ దానికి భ‌ర్త స‌సేమిరా అనేవాడు. ఎక్క‌డైనా స‌రే ఇలాంటివ‌న్నీ భ‌ర్త చెపితే భార్య ప‌ట్టించుకోదు కానీ వీరిద్ద‌రి విష‌యంలో మాత్రం అది రివ‌ర్స్ అయింది. భార్య రోజు రోజుకి ఒత్తికి ఎక్కువ‌గా తీసుకురావ‌డంతో భ‌ర్త స‌రేన‌ని ఒప్పుకుని పోర్న్ చూడ‌టం మొద‌లు పెట్టాడు. 

 

చూడ‌గాచూడ‌గా దాని పైన ఆశ‌క్తిని పెంచుకుని రోజూ చూసేవాడు. అనుకోకుండా ఓ రోజు భ‌ర్త కోర్టుకు వెళ్ళి భార్య‌తో విడాకులు కావాలని కోరాడు దానికి షాకైన భార్య అస‌లు కార‌ణం ఏంటో తెలియ‌లేదు. దాంతో భ‌ర్త‌ను నిల‌దీసిన భార్య ఎందుకు ఇలా చేస్తున్నావ‌ని అడిగింది. దానికి భ‌ర్త స‌మాధానంగా పోర్న్ వీడియోలో నువు క‌నిపించావ్ అని చెప్పాడు. దాంతో భార్య కొంప మునిగింది. వీరిద్ద‌రి వివాహం జ‌ర‌గ‌క‌ముందు ఆమెకు మ‌రో వ్య‌క్తితో సంబంధం ఉండేది. అది అత‌ని భ‌ర్త‌కు చెప్పే వివాహం చేసుకుంది. కానీ భ‌ర్త ఇప్పుడు స‌డెన్‌గా భార్య‌ను అలా చూసేస‌రికి ఆ బాధ‌ను త‌ట్టుకోలేక ఆమెను వ‌ద్దంటున్నాడు. దీంతో భార్య కోర్టువారితో త‌న బాయ్ ఫ్రెండ్ కావాల‌ని అలా చేస్తున్నాడ‌ని త‌నే ఆ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని అలాగే భ‌ర్త‌కు పంపింది కూడా బాయ్ ఫ్‌రెండ్ అని చెపుతుంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఒక‌సారి భ‌ర్త మ‌న‌సు విరిగిన త‌ర్వాత తిరిగి మ‌ళ్ళీ మాములు అవ‌డం అనేది క‌ష్ట‌మైన‌ప‌ని. ఇక వీరిద్ద‌రి విష‌యంలో ఫ్యామిలీకోర్టు  ప్ర‌త్యేక కౌన్సిలింగును ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: