ఆడపిల్ల పుట్టగానే అమ్మో అనుకునే వారు. అమాయికి పెళ్ళి చేయాలి, కట్నం ఇవ్వాలి..ఇదంతా మా వల్ల కాదు అనుకునే తల్లి దండ్రులు ప్రస్తుత రోజుల్లో ట్రెండ్ రివర్స్ అవడంతో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించాలంటే మీ ఇల్లు మాకు నచ్చినట్టుగా ఉండాలి అంటున్నారు. ఆడపిల్లలు తగ్గిపోతున్న నేపథ్యంలో అబ్బాయిలకి పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదన్నది అందరికీ తెలిసిన విషయం.

 

 

ఈ నేపథ్యంలో అమ్మాయిల పెళ్ళి కోర్కెలు చూస్తుంటే అమ్మో అనాల్సిందే.. తాజా సర్వే ప్రకారం పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి కానీ , వారి తల్లి దండ్రులు ఏ బేసిసి మీద పెళ్ళి చేసుకుంటున్నారని సర్వే చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆడపిల్ల అబ్బాయి ఇంటికి రావాలంటే చాలా కండిషన్లు పెడుతున్నారట. అబ్బాయి పెళ్ళి చేసుకోగానే అమ్మా నాన్నలతో ఉండకుండా వేరు కాపురం పెట్టాలనేది అందులో మొదటి షరతుగా ఉందట.

 

 

ప్రతీ అమ్మాయి కూడా మొట్టమొదటి కోరికగా ఇదే కోరుకుంటుందట. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటుండటం విచిత్రం. ఇంకాస్త ముందుకెళితే, అబ్బాయికి అక్క చెల్లెళ్ళు లేకపోతే మరీ బావుంటుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఉన్నా వారు ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తే సరిపోతుంది కానీ, మర్యాదలని చేస్తూ కూర్చోవడం మా వల్ల కాదని చెప్తున్నారట. మొత్తానికి అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయిలు పెట్టే కండిషన్లు చూసి అబ్బాయిలకి మతి పోతుంది.

 

 

ఆడపడుచు తమ దగ్గరకి రాకూడదు అని కోరుకునే అమ్మాయి, లేదా ఆమె తల్లి దండ్రులు ఆ అమ్మాయి కూడా వాళ్ల ఇంటికి ఒక ఆడపడుచే కదా అని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. మరి అమ్మాయిని ఇచ్చేటపుడు మాత్రమే ఇవన్నీ గుర్తుకొస్తాయి కావచ్చు. తెచ్చుకునేటపుడు మాత్రం అందరిలో కలిసిపోవాలి అని గుర్తుకు వస్తాయనుకుంటా.. ఇవన్నీ చూసిన తర్వాత అబ్బాయిలు పెళ్ళంటేనే భయపడే స్థితికి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: