ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని కీలక కేసులు కోర్టుల్లో విచారణకు రానుండగా మరికొన్ని కేసుల్లో తుదితీర్పు వెలువడనుంది. ఈరోజు హజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. శ్రీనివాసరెడ్డి తాను నిర్దోషినని చెబుతున్నా పోలీసులు అతడే నేరం చేశాడని చెప్పడానికి పోస్టుమార్టం రిపోర్ట్, బ్లడ్ టెస్ట్, డీ.ఎన్.ఏ, ఇతర ఆధారాలను సమర్పించారు. బాధిత కుటుంబ సభ్యులు నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఏపీ వైసీపీ రంగులు వేయటంపై దాఖలైన పిటిషన్ గురించి నేడు మళ్లీ విచారణ జరగనుంది. నిన్న ప్రభుత్వ తరపు న్యాయవాది, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయగా హైకోర్టు ధర్మాసనం నేడు ఈ కేసులో కీలక విచారణ చేయనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి దాఖలైన పిటిషన్ల గురించి కూడా విచారణ జరగనుంది. గత నెలలో సుప్రీంకోర్టు జీవో 176పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేయగా ఈరోజు ఈ పిటిషన్ విచారణకు రానుంది. 
 
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వేసిన పిటిషన్ గురించి కూడా ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన విచారణ కూడా ఈరోజు జరగనుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్ గురించి నేడు విచారణ జరగనుంది. 
 
వివేకా హత్య కేసులో దాఖలైన పిటిషన్ గురించి కూడా ఈరోజు కోర్టు విచారణ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో కీలక కేసుల గురించి విచారణ ఈరోజు జరగనుండటంతో ఈ కేసుల్లో ఎలాంటి తీర్పులు రాబోతున్నాయి. ఈ కేసుల్లో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని ఆసక్తి నెలకొంది. 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: