మేడారంలో పూజారులకు చిందులు తొక్కడం ఆనవాయితీ అయిందిగా. భక్తులు సమర్పించే కానుకలు, కొబ్బరి చిప్పలు, బెల్లం బుంగల పంపకాల కోసమే ఇదంతా చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను ఇప్పటికే ఖరారు చేశారు. గిరిజన పూజారులు. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ జాతరలో ప్రధాన పాత్ర గిరిజన పూజారులదే. ఫిబ్రవరి 06న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుకుంది.

 

ఫిబ్రవరి 07న శుక్రవారం రోజు భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంతున్నారు. - ఫిబ్రవరిలో 05న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 08న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.అయితే జాతర ఆరంభంలోనే సమ్మక్క గద్దెకు వచ్చిన తరుణంలో అపశృతి ఎదురైంది. పోలీసులు వాళ్లనే అడ్డుకున్నారు. దీనితో మేడారం రగడ మొదలైంది. అసలేం జరిగిందంటే.. భద్రత విషయంలో పోలీసులు అతి చేస్తున్నారని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క పూజారి రమేశ్‌ను గద్దెల ప్రధాన ప్రవేశ మార్గం నుంచి అనుమతించక పోవడంతో ఆయన ఏకంగా తాళాలను పగులగొట్టి మరీ గద్దెల వద్దకు వెళ్లారు.

 

దీంతో పాటు బుధవారం ఉదయం కన్నెపల్లి ఆడపడుచులు మేడారంలోని గద్దెను అలక (అలంకరణ)డానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 6.50కి సారలమ్మను ఆల యం నుంచి బయటికి తీసుకొచ్చారు. సమ్మక్క గుడి వరకు సాఫీగా సాగిన ప్రయాణం గుడి ప్రాంగ ణం వచ్చే సరికి గందరగోళంగా మారింది. ఒక వర్గం పూజారులు ఆలయం పక్కన ఉన్న విడిది స్థానంలో, మరో వర్గం పూజారులు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు దిగింది.

 

 మొత్తానికి పూజారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమ్మక్క–సారలమ్మ గద్దెల తాళాలను తమ వద్దే ఉంచుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది..  గిరిజన సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు కన్నుల పండుగా సాగే ఈ ఉత్సవానికి కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు... దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు.. ఆసియా ఖండంలోని దేశాల నుంచి కూడా తరలి రావడం ఈ పండుగ ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: