మన మనోభావాలకు అనుగుణంగానే మనకు విజయం లభిస్తుంది. ఉన్నత లక్ష్యాలను ఉన్నత మార్గం సాధించడమే విజయం అనీ మహాత్మాగాంధీ విజయం పై నిర్వచనం ఇచ్చారు. లక్ష్యం మంచిది అయినప్పటికీ మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది విజయం అనిపించుకోదు.


మనకు కుటుంబ వారసత్వంగా ఎన్ని సంపదలు వచ్చినా ప్రతి వ్యక్తి జీవితంలో విజయాలు లేకుంటే వారి జీవితంలో ఎదో ఒక అసంతృప్తి వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని పెంచగల శక్తి ఒక్క విజయానికి మాత్రమే ఉంది. ఒక దేశ అధ్యక్షుడు మొదలుకుని అతి సామాన్యుడు వరకు వారివారి జీవితాలలో ఆలోచించేది మధనపడేది విజయాలు గురించి మాత్రమే.


జీవన ప్రయాణం సాగుతున్నంత సేపు విజయాల కోసం ఆరాటం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ విజయం సాధించాలి అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. బలమైన కోరిక సాధిస్తామనే గట్టి నమ్మకంతో పాటు ధైర్య సాహసాలతో ఆ లక్ష్యం కోసం పోరాటం చేసే సమయంలో ఒక వ్యక్తి తన పట్టుదలను అదేవిధంగా తన ఓర్పును పోగొట్టుకోకుండా ఉండాలి. పని పట్ల అంకిత భావం నిబద్ధత నాణ్యత జీవితంలో రాజీలేని ధోరణి అందరితో కలిసి పనిచేయగల సామర్ధ్యం న్యాయకత్వం వహించగల శక్తి ఉన్న వారికి మాత్రమే విజయాలు లభిస్తాయి.


ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఇతరుల సహకారం ఖచ్చితంగా అవసరం. దీనికోసం ఇతరులను మెప్పించే సంభాషణ చాతుర్యం కలిగిన వ్యక్తికి మాత్రమే విజయంతో పాటు సంపద కూడ లభిస్తుంది. సమయపాలనా క్రమశిక్షణ ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే విజయ శిఖరాలను చేరుకొని ఐశ్వర్య వంతులుగా మారుతారు. అయితే విజయానికి పక్షపాతం లేదు దానికి కులం మతం ఉండదు. విజయ సాధన ప్రయాణంలో అనేక సార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారి కష్టాలు కన్నీళ్లు తప్పక పోవచ్చు. అయితే వాటిని భరించి ఎదిరించి నిలబడగల వ్యక్తి మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: