రాజధాని మార్చడానికి ఇదా కారణం? ఎవరితోనైనా చెబితే నవ్విపోతారని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ వేదికపై అదీ కూడా ది హిందూ పత్రిక నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరై చెప్పారు. మేధావులు హాజరైన ఈ సభలో ఇంత సిల్లీ రీజన్ చెప్పి రాజధాని మార్పును సమర్ధించుకోవడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. విశాఖ లో నాలుగు లైన్ల రోడ్డు ఇప్పుడు ఉన్నది. సింగిల్ లైన్ రోడ్డు ఉన్న అమరావతి రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో పనికి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.

సింగిల్ లైన్ రోడ్డు ఉంటే దాన్ని డబుల్ లైనూ, ఫోర్ లైనో చేసుకోవాలి కానీ దాని ఖర్మానికి దాన్ని వదిలేస్తారా? ఫోర్ లైన్ రోడ్డు ఉన్న చోటికి వెళ్లిపోతారా? ఇదేం లాజిక్కు?. నిన్నముఖ్యమంత్రి చెప్పిన మాటలను చూస్తే ఇక అమరావతిలో రోడ్లు కూడా వేయరన్నమాట. కమ్మోళ్లను ఆర్ధికంగా దెబ్బ తీయాలంటే తీసుకోండి. కమ్మోళ్లూ రెడ్డోళ్లూ తేల్చుకోవాలి కానీ రాష్ట్రం ఏమి చేసింది? రాష్ట్రానికి అన్యాయం చేయడం ఎందుకు? అయినా ఒక ప్రశ్న. విశాఖ పట్నంలో కమ్మోళ్లు లేరా? అక్కడున్న వ్యాపారాలలో చాలా భాగం కమ్మ కులస్తుల చేతుల్లోనే ఉన్నాయి. 


అలానే ఉంచాలి. అప్పుడే విశాఖకు ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను ఛిద్రం చేసి నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి కదా అని అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయడం అవివేకం. రాజధాని కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలనేది మరో విచిత్రమైన వాదన. లక్ష కోట్లు ఎందుకు అవసరం అవుతాయి? ఐకానిక్ బిల్డింగుల పేరుతో చంద్రబాబు చేసినట్లు జిమ్మిక్కులు చేయాలంటే అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న భవనాలు అలాగే ఉంచినా ఎవరూ కాదనరు.

 

ఇప్పుడు ఉన్న భవనాలు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. అటు విజయవాడా కాదు ఇటు గుంటూరు కాదు అని ముఖ్యమంత్రి మరో కామెంట్ చేశారు. విజయవాడ, గుంటూరులలో గజం స్థలం దొరుకుతుందా? అందుకే రెంటికి మధ్యలో రాజధాని నిర్మించారు. అక్కడ ల్యాండ్ అభివృద్ధి చేసుకోవాలి చేతైనతే. అంతే కానీ అమరావతికి రోడ్డు లేదు కాబట్టి విశాఖ పట్నం పోతున్నామని చెప్పడం అన్యాయం, దారుణమన్న కధనం సోషిల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విధంగా ఎపి ప్రజలను తమ స్వార్ధ ప్రయోజనాలను ఆశించి దారి మళ్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని హ్యూమన్ రైట్స్ ప్రతినిధి ర్యాలీ చంద్ర శేఖర రావు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: