చంద్రబాబునాయుడుకు ఏపిగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటి దాడులు జరగటం సంచలనంగా మారింది. ఓ సెక్షన్ మీడియాలో ఏసిబి దాడులని కూడా వస్తోంది లేండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శ్రీనివాస్ పిఏగా పనిచేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చంద్రబాబు దగ్గరే ఈయన పనిచేశాడు. జీఏడి ఉద్యోగిగా ఉండే శ్రీనివాస్ దాదాపు ఐదేళ్ళ పాటు చక్రం తిప్పాడు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పటం సంగతేమో కానీ ఆయన పిఏ మాత్రం ఐదేళ్ళు ఫుల్లుగా చక్రం తిప్పాడనే చెప్పుకోవాలి.

 

టిడిపి అధికారంలో ఉన్నపుడు శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు వినబడేవి. మంత్రుల్లో కానీ చాలామంది ఎంఎల్ఏలను, నేతలు చంద్రబాబును కలవకుండా పిఏనే అడ్డుపడేవాడని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడేవి పార్టీలో.  సరే ఎన్ని ఆరోపణలు వచ్చినా చంద్రబాబు అయితే వేటిని పట్టించుకోలేదు లేండి. ఇటువంటి అనేక ఆరోపణలు రావటం, చంద్రబాబు చాలా లైట్ తీసుకున్న ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమి.

 

తెలుగుదేశంపార్టీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం పిఏ కూడా ఎక్కడా కనబడలేదు. తర్వాత మెల్లిగా ఉన్నతాధికారులతో మాట్లాడుకుని జీఏడిలో చేరిపోయారు.  ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సిఎంవోలో చక్రం తిప్పిన వాళ్ళల్లో చాలామంది ఐఏఎస్ లకు జగన్ ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందులో శ్రీనివాస్ కూడా ఒకడు. అలాంటిది ఎవరి ప్రాపకమో సంపాదించి మెల్లిగా మళ్ళీ జీఏడిలో చేరిపోయాడు.

 

చంద్రబాబు దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తికి జగన్ ప్రభుత్వం  జీఏడిలో పోస్టింగ్ ఇవ్వటంపై అప్పట్లోనే బాగా విమర్శలు వచ్చాయి. అయినా ఎవరో ఉన్నతస్ధాయిలో వ్యక్తులు సాయం చేయటం వల్లే ఈయనకు కీలకమైన జీఏడిలో పోస్టింగ్ వచ్చిందన్నది వాస్తవం. ఏ ప్రభుత్వానికైనా జీఏడి అన్నది గుండెకాయ లాంటిదనే చెప్పాలి. ఇటువంటి చోట పోస్టింగ్ వేసేటపుడు  ప్రభుత్వం అన్నీ విషయాలను జాగ్రత్తగా గమనించి కానీ పోస్టింగ్ ఇవ్వదు. అలాంటిది ఏకంగా శ్రీనివాస్ జీఏడిలో పోస్టింగ్ తెచ్చేసుకున్నారంటే ఎంత గట్టివాడో తెలుస్తోంది. అలాంటి శ్రీనివాస్ పై హఠాత్తుగా ఐటి / ఏసిబి దాడులు జరగటమంటే మామూలు విషయం కాదు. చూద్దాం ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి: