ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు లో ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య విధానం ప్రవేశ పెట్టడం. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీష్ భాషా కంపల్సరి అని ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్యా విధానం ఇంపార్టెంట్ అని జగన్ తెలపడం జరిగింది. నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం దూరమవుతుందని..దాంతో విద్యాపరంగా పేద విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించలేక పోతున్నారని ఇందు మూలంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రవేశ పెడుతున్నట్లు జగన్ తెలపడం జరిగింది.

 

దీంతో జగన్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అని చెప్పటం జరిగిందో ప్రతిపక్ష పార్టీలు మరియు తెలుగు భాషా ప్రవీణులు తెలుగు భాషని జగన్ కనుమరుగు చేసేటట్టు ఉన్నాడని విమర్శించడం జరిగింది. ఇంకా అనేక విమర్శలు జగన్ పై రాజకీయంగా వివిధ పార్టీల నేతలు ఆరోపించడం జరిగింది. దీంతో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో జగన్ సర్కార్ కి వెనక్కి తగ్గాలని ప్రభుత్వ సలహాదారుడు ఎంత చెప్పినా గానీ జగన్ మొండిగా ముందుకు వెళ్లడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల న్యాయస్థానాలు రాజ్యాంగ పరంగా విద్యా హక్కును హరించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలుగు భాషను ప్రవేశపెట్టాలని అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా కొనసాగించాలని ఏపీ సర్కార్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. రెండు భాషల విద్యావిధానంలో ఎంచుకునే హక్కు స్టూడెంట్ కి ఉందని దీనిలో ప్రభుత్వం కలుగచేసుకునే హక్కు లేదని సూచించడంతో...ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంలో చివరికి జగన్ సర్కారు వెనక్కి తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: