ప్రస్తుత సమాజంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా జరుగుతున్నసంఘటనను చేసినవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తాళి కట్టిన భర్తను ఏ మార్చడం, తమ సరదాలకు అడ్డుగా ఉన్నాడని అడ్డుతొగించం వంటి పరిణామాలు నెలకొన్న అధిక సమాజమిది. ఈ నేపథ్యంలో భర్తను రక్షించుకునేందుకు చివరికి అడుకునేందుకు కూడా వునకాడడం లేదు. నిజంగా ఈ ఘటన విస్మయాన్ని కలిగించే విషయమే కదా..?.                భర్త ప్రాణం కోసం భార్య భిక్షాటన చేస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. బిక్షాటన చేస్తున్న భార్య గత నెల జనవరి 31 , 2020 సంవత్సరంలో పదవి విరమణ చెందారు.

ఆ సమయంలో గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ప్రభుత్వ నుంచి ఆర్ధిక చేయుట లేని పరిస్థితుల్లో తన భర్త గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దానికి కావలసిన అమౌంట్ బయట టెస్టుల గురించి హోంగార్డుగా రిటైర్మెంట్ అయిన భార్య యూనివర్సిటీలో భిక్షాటన చేయడం పలువురిని కలిచి వేసింది. ఇన్నిరోజుల జీవితంలో ఎన్నడు ఒకరి దగ్గర డబ్బులు అడిగిన సందర్భం లేదు.  

ఇప్పుడు నా భర్త ప్రాణాల కోసం బిక్షాటన చేయడం చాలా బాధాకరంగా ఉన్నది అని సదరు రిటైర్ అయిన మహిళ ఆవేదన వ్యక్తం చేసుకున్నది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ అయిన పలువురు హోంగార్డులు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో 5000 , 6000 రూపాయలకు వాచ్ మెన్ వృత్తి నిర్వహిస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి హోంగార్డులకు జీతభత్యాలు పెంచిన నేపథ్యంలో మేము ఎక్కువ అనుభవించలేని పరిస్థితి నెలకొన్నది.

మా టైం బాగోలేక మా కాలపరిమితి అయిపోయింది మేము ఇక్కడ వాచ్ మెన్ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని పలువురు రిటైర్మెంట్ అయిన హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దయచేసి తమరు ఇక మిగిలిన ఉద్యోగస్తులు హోంగార్డులకు తెలంగాణ గవర్నమెంట్  ఏమైనా న్యాయం చేయగలరు అని ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: