అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలిస్తుంది అంటూ రాయిటర్స్  ఓ కథనం ప్రసారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కథనంపై ఏపీలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై కీయ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో పాటు ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన ఇచ్చినా  దీనిపై విమర్శలు ఆగడంలేదు. దీనిని అలుసుగా తీసుకొని వైసీపీ ప్రభుత్వం పై టిడిపి నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఈ అంశాన్ని మరింతగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు వరకు వెళ్ళింది.  పార్లమెంటులో టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయత్నించగా... వైసిపి వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు.


 కియా మోటార్స్ ప్లాంట్ ఎక్కడికి వెల్లడమేలేదని, మీ పార్టీ నాయకులే కావాలని దీనిపై దుష్ప్రచారం చేస్తూ ఏపీలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చకే కియా మోటార్స్ తమిళనాడుకి తరలిపోతోంది అంటూ రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తుండగా మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి అడ్డుపడి గట్టిగానే సమాధానం చెప్పారు. తాను ఇదే విషయమై కియా మోటార్స్ ఎండీతో కూడా మాట్లాడాను అని ప్లాంట్ ను తాము ఎక్కడకి తరలించడంలేదు అని వారు తనతో చెప్పారని మిథున్ రెడ్డి చెప్పారు. 


దేంతో ఈ విషయంపై ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ ఎంపీలు సైలెంట్ అయిపోయారు. ఇదే విషయమై అంతకు ముందే టీడీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. కియా మోటార్స్ వారికి ఏపీ ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయంటూ ఆయన ట్విట్ చేశారు. కియా మోటార్స్ సంస్థతో పాటు ప్రభుత్వం దీనిపై వివరణ  ఇస్తున్నా టీడీపీ మాత్రం ఏదో ఒక రకంగా ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని  అభాసుపాలు చేయాలనీ చేస్తుండడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: