ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర జరుగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పరిశ్రమలు పెట్టిన వారిని టార్గెట్ చేసుకుని లేనిపోని తప్పుడు వార్తలు రాస్తోందని ఖండించారు. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రాష్ట్రం నుండి వెళ్ళిపోతుందని వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఇటువంటి వార్తలను ప్రచురణ చేస్తున్న ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా ఛానల్ ని ఆర్థిక మంత్రి ఖండించారు. కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రానికి తరలి పోతున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా తప్పు పట్టారు. కావాలని ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయడానికి కుట్రపూరితంగా ఏపీ లో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిచేస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

 

కియా విషయంలో కావాలనే గందరగోళం సృష్టించారని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.  తమ ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో కియా సంస్థ యాజమాన్యం ఎంతో సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయో తమకు కూడా తెలియదని కియా సంస్థ యాజమాన్యం చెప్పిందని బుగ్గన అన్నారు. కొందరు కావాలనే కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు.

 

సోషల్ మీడియాలో కూడా ఈ విధంగానే దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విధమైన చర్యలకు పాల్పడే వారిని రాబోయే రోజుల్లో కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బుగ్గన స్పష్టం చేశారు. బిర్లా, ఏటీసీ టైర్స్‌, స్మార్ట్‌టెక్‌ టెక్నాలజీస్‌ లాంటి సంస్థలు త్వరలేనే ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని బుగ్గన తెలిపారు. ఏపీలో పరిశ్రమల పెట్టుబడులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టించే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటు బుగ్గన చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: