మేము బీజేపీతో కలిసి పొత్తు పెట్టు కుంటా....ము. ఆ మోదీ తొందర్లోనే మా బుట్టలో పడతా...డు. మేమంతా కలిసి రాజ్యాధికారం సాధిస్తా.... ము. అప్పుడు మీరంతా... మమ్మల్ని చూసి ఏడవా...లి. ఇదే కదా జరగబోయే రాజకీయం. ల ల ల ల అంటూ పాటలు పాడుకుంటూ సెంద్రం సారూ చాలానే ఊహించుకున్నాడు. అబ్బా అప్పట్లో తొందరపడి ఆ పువ్వు పార్టీని అవతలకి పొమ్మనడమే కాదు... తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళేసి మరి సన్మానం చేసేసారు. ఇప్పుడేమో ఇలా సీన్ రివర్స్ అవుతుంది అని ఊహించలేదు అంటూ ఓ బాధపడిపోతున్నాడు సెంద్రం సార్. అవునులే చేసిన ఘనకార్యాలు మామూలువి అయితే... వాళ్ళు కూడా పోన్లే జరిగింది ఏదో జరిగింది అని ఊరుకునే వారు.


కానీ రాళ్ల తో సన్మానం చేస్తే వాళ్లకు తగిలిన దెబ్బలకు ఇప్పటికీ బర్నాల్ రాసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూనే ఉన్నారు. అప్పట్లో సైకిల్ పార్టీ వాళ్ళు ఆ పువ్వు పార్టీ మీద బాలయ్య డైలాగులు చెప్పి... తొడలు కొట్టారు కదా ! వాళ్ళు మర్చిపోతారా ఏంటి ? అందుకే ఎన్నికల ముందు నుంచే ఓ సాంగ్ వేసుకున్నారు. రావాలి జగన్ ... కావలి జగన్ అని. అందరూ అనుకున్నట్టే ఆ జగన్ బాబు వచ్చాడు. ఎవర్ని ఎక్కడ నొక్కాలో... ఎవర్ని ఎక్కడ తొక్కలో అలా ... తొక్కేస్తున్నాడు. ఇప్పుడు అర్ధం అవుతోంది సెంద్రం సారుకి నా ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ లో ఇలాంటివి చూడలేదమ్మా అని.


అవును అందరూ ఊహించినట్టుగా చేస్తే ఆ జగన్ బాబు స్టయిల్ ఏముంటుంది ? అందుకే పక్కాగా స్కెచ్ లు, మ్యాప్ లు వేసేసి రఫ్ ఆడించేస్తున్నాడు. ఇప్పుడు ఆ దెబ్బకి మావుల్లో పడ్డ చేపల్లా గిల గిల కొట్టేసుకుంటున్నారు. అయ్య బాబోయ్ జగన్ దెబ్బలు మేము తట్టుకోలేము మొర్రో అని ఆ పువ్వు పార్టీ దగ్గరకు శరణు శరణు అంటూ వెల్దామా అంటే మనకి అంత సీన్ లేదు అని తెలుసు. పోనీ అందరిలా సైలెంట్ గా ఉందామా అంటే మా సెంద్రం సార్ ది మాములు బ్రెన్ కాదు.


అమెరికా కే కంప్యూటర్ పాఠాలు చెప్పిన బ్రెన్ ! అందుకే... ఆ బ్రెన్ ను బయటకి తీసి రాయి కేసి రుద్ది మరీ పదును పెట్టి కొత్త  ఐడియా, ఎయిర్టెల్ ఇలా అన్ని వేసి కొంతమంది చెంచాలను పువ్వు పార్టీలోకి తోలేశాడు. ఒరేయ్ నేను శరణు మహా ప్రభూ అంటున్నా అని చెప్పండ్రా ... అంటే పోనీలే అని వాళ్ళు మొహమాటం గా చెబితే అంతొద్దు ! మీ లిమిట్స్ లో మీరు ఉండండి అని పువ్వు పార్టీ పెద్దలు ఆ చెంచాలను చెడామడా తిట్టేసారు. ఇప్పుడు ఏమి చేయాల్రా నాయనా అనుకుంటూ దత్త పుత్రుడు కళ్యాణం ని పువ్వు పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేసి నువ్వయినా కాస్త పుణ్యం కట్టుకోరా అంటే వాళ్లేమో కల్యాణంతో పొత్తు పెట్టుకుని మూతికి ప్లాస్టర్, చేతికి బేడీలు వేసి మూలన కూర్చోబెట్టారు.


పోనీ భ్రమరావతిలో రాజధాని వస్తుందని 4 వేల ఎకరాలను కొనిపిస్తే ఇప్పుడు జగన్ విశాఖ అంటున్నాడు. ఆ పువ్వు పార్టీ వాళ్లేమో జగన్ ఏదంటే అదే. మాకు అమరావతి లేదు.. భ్రమరావతి లేదు ఆసలు ఇక్కడ మీ చావేదో మీరు చావండి అని సెంద్రం ఆశలకు వెన్నుపోటు పొడిచి పెద్ద తలపోటు తెచ్చేసారు. ఇప్పుడు ఆ భ్రమరావతిలో సేంద్రాన్ని నమ్ముకుని సేద్యం భూములు కొన్నవారి టార్చర్ మాములుగా లేదు. ఇక ఈ డొక్కు సైకిల్ వేసుకుని ఎలా తిరగాలి... మా మాలోకం పరిస్థితి ఏంటి ? ఇదే కదా మా సెంద్రం డవుట్ తో కూడిన అనుమానపు తాలూకా భయం. అందుకే బ్రెయిన్ బయటకి తీసి మరీ వాష్ చేసుకొనేపనిలో పడ్డాడు మా సెంద్రం సారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: