న‌ల్ల‌గొండలోని భువ‌న‌గిరి జిల్లా బొమ్మ‌ల రామారం మండ‌లం హాజీపూర్ గ్రామంలో వ‌రుసగా అమ్మాయిల మిస్సింగ్‌, హ‌త్య‌ల కేసులో నిందితుడు అయిన మ‌ర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తు ఈ రోజు న‌ల్ల‌గొండ కోర్టు ఈ రోజు తీర్పు వెలువ‌రించింది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ కేసులో ఎట్ట‌కేల‌కు తీర్పు వ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన‌ న‌ల్ల‌గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేవ‌లం 90 రోజుల్లోనే ఈ కేసు విచార‌ణ పూర్తి చేసింది. ఇక తీర్పు సంద‌ర్భంగా జ‌డ్జీలు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మ‌ర్రి శ్రీనివాస్‌రెడ్డి త‌న‌కు తెలియ‌ద‌ని స‌మాధానం చెప్పాడు. 

 

కోర్టులో తీర్పు సంద‌ర్భంగా శ్రీనివాస్‌రెడ్డి శిక్ష సంద‌ర్భంగా ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా ? అని అడ‌గ‌గా త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని అమాయ‌కంగా మాట్లాడడం గ‌మ‌నార్భం. ఈ యేడాది జ‌న‌వ‌రి 3వ తేదీన నిందితుడు వాద‌న‌లు కూడా కోర్టు తెలుసుకుంది. అయితే నిందితుడు మాత్రం త‌న‌కు ఆ ముగ్గురు బాలిక‌లు ఎవ‌రో తెలియ‌ద‌ని కూడా చెప్పాడు. త‌న ఇళ్లు కూడా కూల్చేశార‌ని.. త‌న త‌ల్లిదండ్రుల‌ను చూసుకునేందుకు ఎవ్వ‌రూ లేర‌ని కూడా శ్రీనివాస్‌రెడ్డి చెప్పుకున్నాడు. 

 

ఇక ఈ కేసు విచార‌ణ అధికారిగా భువ‌న‌గిరి ఏసీపీ భుజంగిరావును నియ‌మించారు. మొత్తం మూడు నెల‌ల పాటు 50 ప‌ని దినాల‌లో మొత్తం 101 మంది సాక్ష్యుల‌ను విచారిచారు. ఇక ప్ర‌త్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు పూర్వాప‌రాలు చూస్తే 2015లో క‌ల్ప‌న‌ను త‌న బైక్‌పై తీసుకు వెళ్లి దారుణంగా రేప్ చేసి చంపేసి.. త‌న వ్య‌వ‌సాయ బావి వ‌ద్ద పాతిపెట్టాడు. క‌ల్ప‌న కోసం ఆమె కుటుంబ స‌భ్యులు తిర‌గ‌ని ప్ర‌దేశం అంటూ లేదు. 

 

అలాగే శ్రావ‌ణిని చంపేసి బావిలో ప‌డేయ‌డంతో ఆమె మృత‌దేహం కోసం వెతికిన క్ర‌మంలోనే మ‌నీషా ఐడీ కార్డు దొర‌క‌డంతో ఆమెను కూడా చంపేశాడ‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇక శ్రీనివాస్‌రెడ్డి ఈ ముగ్గురిని చంపిన‌ట్టు ఒప్పుకున్నాడు. ఇక ఈ మూడు కేసుల‌తో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన మ‌రో మ‌హిళ‌పై కూడా అత్యాచారం చేసి చంపేసిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: