వైసీపీ అధికారంలోకి వచ్చిన బావాబావమరుదులు అయ్యే ఇద్దరు నేతలు మాత్రం పెద్దగా కనపడటం లేదు. మొన్న ఎన్నికల్లో ఒకరు ఓడిపోయి, ఒకరు సీటు దక్కకపోవడంతో..ఇప్పుడు పార్టీలో సందడి చేయడం లేదు. ఇలా సందడి చేయకుండా సైలెంట్ గా ఉన్న బావాబావమరుదులు ఎవరో కాదు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిలు.

 

అసలు మోదుగుల టీడీపీలో కీలక నేతగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. 2009లో నరసారావుపేట ఎంపీగా గెలిచిన మోదుగుల, సమైక్యాంధ్ర ఉద్యమంలో బాగా యాక్టివ్ గా పని చేశారు. రాష్ట్రం విడిపోయే సమయంలో లోక్ సభలో బాగా హైలైట్ అయ్యారు. తర్వాత రాష్ట్రం విడిపోయాక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపునే గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన మోదుగుల, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు.

 

ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున గుంటూరు ఎంపీగా పోటిసి చేసి, గల్లా జయదేవ్ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇక ఓడిపోయాక గల్లా గెలుపుపై అనుమానాలున్నాయని కోర్టుకు కూడా వెళ్ళి...కొన్ని రోజులు బాగానే వార్తల్లో మెరిశారు. కానీ గత కొంతకాలం నుంచి ఆయన కనపడటం మానేశారు. అటు మోదుగుల బావ , మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సోదరుడు అయిన అయోధ్యరామిరెడ్డికి మొన్న ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఈయన 2014లో నరసారావుపేట వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

మొన్న టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయిన అయోధ్య..రాజ్యసభ ఏమన్నా వస్తుందా అని వెయిట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక మోదుగుల కూడా జగన్ ఏదొక పదవి ఇవ్వకపోరా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్తితుల్లో వీరికి పదవులు రావడం కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో పోటీ ఉండటంతో, బావాబావమరుదులకు పదవి యోగ్యం లేనట్లే అనిపిస్తుంది. మరి చూడాలి జగన్..వీరికి ఏదైనా పదవి ఇస్తారేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: