నారా లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీకి కాబోయే రథసారథిగా.. చంద్రబాబు తరువాత్ర్హ ఆ స్థాయిలో చక్రం తిప్పాల్సిన నాయకుడిగా లోకేష్ కు ఆ పార్టీలో ఎక్కడలేని ప్రాధాన్యం దక్కుతోంది. లోకేష్ కూడా తనను తాను సమర్థుడైన నాయకుడుగా నిరూపించుకునేందుకు అదే స్థాయిలో తంటాలు పడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వంపైనా, అమరావతి వ్యవహారంలోనూ లోకేష్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీని కోసం ఆయన స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఇది ఇలా ఉండగా...  ప్రభుత్వం తరపున ఆయనకు కల్పిస్తున్న భద్రతను తగ్గిస్తూ ఈరోజు హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ కు భద్రత తగ్గింపు ఇది రెండోసారి. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించే వారు. అయితే దీనిని గతేడాది జూన్ లో దీనిని కుదించారు.ఇకపై ఆయనకు ఒక్క గన్ మాన్ చొప్పున మాత్రమే భద్రత కల్పించబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా సెక్యూరిటీ ని తగ్గించారు.  అయితే దీనిపై కోర్టులో పిటిషన్ వేయగా ప్రభుత్వం నిబంధనల మేరకే తాము భద్రత కల్పిస్తున్నామంటూ వివరణ ఇచ్చి భద్రత తిరిగి పునరుద్ధరించింది. 


తాజాగా లోకేష్ కు భద్రతను తగ్గించారు. లోకేష్ ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తున్న కారణంగానే ఆయన భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించి ఆయన జనాల్లోకి రాకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీకి ఏ సంబంధం లేదని, పూర్తిగా పోలీసులే ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారని, అవసరం మేరకు సెక్యూరిటీని కల్పించడం, తగ్గించడం అనేది వారి చేతుల్లో ఉంటుందని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: