ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా మూడు రాజధానులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మూడు రాజధాని గురించి పెద్దగా తెలియదని కానీ ఇటువంటి కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉన్నా గాని రాష్ట్రానికి జరగాల్సిందే అభివృద్ధి అని సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రాబోయే పదేళ్లలో విశాఖపట్టణనీ హైదరాబాద్ మరియు బెంగుళూరు తరహాలో అభివృద్ధి చేస్తానని అంటున్నారు అలా కాకుండా డీ సెంట్రలైజ్ చేయాలని అన్నారు.

 

గతంలో హైదరాబాద్ నగరంలోని అభివృద్ధి చేసి చాలా తప్పు చేశారని అటువంటి పొరపాటు చేయకూడదు అని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాజధాని అంశాన్ని పక్కనపెట్టి రాష్ట్రానికి అత్యవసరమైన పోలవరం మరియు ప్రత్యేక హోదా పై దృష్టి పెట్టాలని జగన్ సర్కార్ కి సూచించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు వచ్చే ఏడాది జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి అక్కడ ఏమీ కనపడటం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికే పింఛన్లు తీసుకుపోయి ఇవ్వటం మనది చాలా వేస్ట్ అని దానివలన ప్రజల పనులు ఆగిపోతాయని...ఆరోజు పనులు అప్పుకొని ఇంటి దగ్గరే కూర్చో వలసిన పరిస్థితి వస్తుందని ఎక్కడో ఒక చోట పెట్టి ఇస్తే ప్రజలు వెళ్ళి తెచ్చుకుంటారని అన్నారు.

 

ఇక జనసేన అధినేత పవన్ గురుంచి కూడా మాట్లాడుతూ సినిమాలు మళ్ళీ చేసుకోవడం మంచి నిర్ణయమేనని ఇది నేను ఆయనకు ఏనాడో చెప్పానని ఉండవల్లి తెలిపారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన ఉండవల్లి అమరావతి రాజధాని విషయంలో క్లియర్ కట్ గా భూములు ఇచ్చిన రైతులకు అర్థమయ్యేరీతిలో జగన్ తన నిర్ణయాన్ని చెప్పలేక పోయినట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: