టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఆ రెండు పత్రికలు కథనాలు రాస్తాయన్న సంగతి జగద్వితితమే.. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే.. చంద్రబాబును అనేక సార్లు కష్టకాలంలో ఆదుకున్న ఆ పత్రికలు కూడా ఇప్పుడు అలసిపోయాయట. చంద్రబాబును మోసీ మోసీ విసిగిపోయాయట. తన కొడుకు అసమర్ధుడు, ప్రజలకు దగ్గర కాలేకపోయామన్న నిస్సహాయ స్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

 

కేవలం మీడియాతోనే బతకాలని చూస్తున్నారని.. పార్టీలో చీలిక తప్పదన్న ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబును మోయడం వల్ల మాకు వచ్చే లాభం లేదని పత్రికాధినేతలు కూడా అలసిపోయారట. ఇది పసిగట్టిన చంద్రబాబు రోజు పత్రికాధినేతలను పిలిచిపించుకొని ప్యాకేజీలు ప్రకటిస్తున్నారట. ఈ విమర్శలు చేసింది ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

 

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు కాలయాపన చేశారు. మా సీఎం నిన్న దీ హిందు పత్రిక నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన తీరు చూసి ప్రజలు సంతోషిస్తున్నారు. నీ పత్రికలు ఎంతకాలం మోస్తారు. చంద్రబాబు అన్‌ఫిట్‌ అని ప్రజలు అర్థం చేసుకున్నారు.

 

 

రెండుసార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి నిన్న మీటింగ్‌ పెడితే వంద మంది కూడా హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలను చూసి మాట్లాడారు. గుండా మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దేవినేని ఉమా లాంటి తోక నాయకులు డబ్బు ఉందన్న మదంతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాయకుడు అన్న వ్యక్తి ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా ఐదేళ్లలో చేయలేదని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: