టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి. దమ్ముంటే జగన్ సెక్యూరిటీ లేకుండా బయటకు రావాలని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. ఇదే తరహా సవాళ్లు విపక్షాల నుంచి వస్తున్నాయి. దీనికి కౌంటర్ గా ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మొదలు పెట్టారు. చంద్రబాబుకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

 

వైయస్‌ జగన్‌కు సవాలు విసిరే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని.. మా నాయకుడు పాదయాత్ర చేస్తే కృష్ణా వారధి, గోదావరి వారధి ఊగిందని.. అలాంటి నాయకుడితో నీకు పోలికా? అంటూ చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. జెడ్‌ప్లస్‌ క్యాటగిరి లేకుండా బయటకు రాని చంద్రబాబు మా నాయకుడికి సవాలు విసురుతారా?. అని ప్రశ్నిస్తున్నారు.

 

చంద్రబాబుకు దమ్ముంటే పోలీసులతోనే తుళ్లూరుకు రావాలి.. మా నాయకుడు కాదు..నేనే వస్తా. మేం తీసుకున్న విధానాలు ప్రజలకు చెబుతాం..మీరు ప్రలోభాలు పెట్టింది. ఏ రకంగా రైతులను మభ్యపెట్టింది క్లియర్‌గా చెబుతాం. ఆ ధైర్యం మీకుందా బాబూ?. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే..రైతుల సమస్యలపై ప్రస్తావించాలి. మూడు గ్రామాల్లో మీ బినామీలు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణ ఎందుకు జరగాలో మేం స్పష్టంగా చెబుతాం. వికేంద్రీకరణ వద్దని చెప్పే ధైర్యం నీకుందా బాబూ..అని నిలదీస్తున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

 

రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని విశాఖలో నక్సలైట్లు ఉన్నారని వార్తలు రాయించావు. ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. కీయ పరిశ్రమ పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. కియా పరిశ్రమ యాజమాన్యమే మేం ఎక్కడికి వెళ్లడం లేదని చెబుతున్నా కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి సంబంధించి తప్పుడు వార్తలు రాస్తే దాన్ని ఖండించాల్సింది పోయి..తప్పుడు వార్తలు మీరే రాయించుకొని ఆనందపడటం చూస్తే ఆంధ్ర పౌరుడిగా సిగ్గుపడుతున్నాను. రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా? ఆదాని, లూలూ పరిశ్రమలపై మా మంత్రులు స్పష్టంగా వివరణ ఇచ్చారు.. అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: