రాజధానిని ఎక్కడికి తరలిచడం లేదు.. ఇక్కడి నుంచి ఒక పార్ట్ ను విశాఖ, మరో పార్ట్ కర్నూలుకు తరలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో రాజధానులను అభివృద్ది చేయాలనేది సీఎం గారి ఉద్దేశ్యమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అందరికీ న్యాయం చేయాలని జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ఎవరికో అన్యాయం చేయాలనే ఆలోచన జగన్ కి లేదని తెగేసి చెప్పారు. మీలాగా దావోస్ కు వెళ్ళాలి... సెమినార్లు ఏర్పాటు చేసుకుని.. ఏదో చేస్తున్నట్లు హంగామా చేయడం లేదన్నారు. ఈ ప్రాంతంలోని వారిని మీరు అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల్లో అర్ధం లేని భ్రమలు కల్పిస్తున్నారు. కొద్దిపాటి సమన్వయం వహిస్తే.. నిజమైన అభివృద్థిని ఈ ప్రాంతవాసులు చూస్తారన్నారు.  

చంద్రబాబు అప్పులు విపరీతంగా చేసి, వడ్డీలు కూడా కట్టకుండా ఆ భారం మా ప్రభుత్వం పై వేశారని విమర్శించారు. అయినా కూడా మా ప్రభుత్వం వాటిని భరించిందన్నారు. జగన్ పై విశ్వాసంతో ప్రజలు పెద్ద మెజారిటీ ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మేం చేసిన పనుల వల్లే మళ్లీ మాకు అధికారం వస్తుందన్నారు.  అప్పటి వరకు టిడిపి బాధ్యతాయుతమైన సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టడం వల్ల మీరే అభాసుపాలవుతారని హెచ్చరించారు. దమ్ముంటే సీఎంను తెనాలి రమ్మని చంద్రబాబు సవాల్ చేశారు. సెక్యూరిటీ లేకుండా తుళ్ళురు రమ్మని సవాల్ చేశారు.

పదిమందితో అల్లర్లు చేయాలని మీరు అనుకుంటున్నారు. చంద్రబాబు తన సెక్యూరిటీ వదిలి ఒక్క కారులో తిరుగుతున్నాడా...?.  ఇది మీ ప్రాంతం అని చెప్పుకుంటున్నావు. ఎన్ ఎస్ జితో ఎందుకు తిరుగుతున్నావని నిలదీదారు. మీ  వెనుక వున్న రెండు పత్రికలు, టివి చానెల్ళకు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న విషయాలు తెలియవా...?.  ఇక్కడ మాత్రమే... ప్రజలు చెప్పేది అభిప్రాయమా?. బాధ్యతాయుతంగా మేం అధికారంలో వున్నాం. అన్ని చోట్ల వికేంద్రీకరణ కోసం సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరగుతున్నాయి. ఢిల్లీలో రాజధాని రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అని చెప్పినా మీకు బుద్ది రాలేదు.  

ఎమ్మెల్యే ఆర్కే తీసకువెళ్ళిన వారు రైతులు కాదు అని అన్నారు. జెఎసి లో కాంట్రాక్టర్లు, టిడిపి కార్యకర్తలు, నిర్మాణ రంగ కంపెనీ వారు ఎలా వున్నారు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేరు. ఇది అన్ని ప్రాంతాల ప్రజల మద్దతుతో తీసుకున్న నిర్ణయం. మీ మీద విసిగిపోయిన కొందరు మీ శాసనసభ్యులు కూడా ఈ నిర్ణయంను సమర్థిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఆపడం చంద్రబాబు వల్ల కాదు. ప్రజలు కూడా దీనిని బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు.దేశంలో రాష్ట్రంను అగ్రగామిగా నిలబడే నిర్ణయంగా దీనిని చూస్తున్నారు. జగన్ పై ప్రేమ వున్న ఈ ప్రాంత వాసులు కూడా దీనిని అర్థం చేసుకోవాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ కంటే ఎక్కువ ప్రేమే ఇక్కడి ప్రజలపై జగన్ గారికి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: